Bilkis Bano case: బిల్కిస్ బానో కేసు.. సంచలనం సృష్టిస్తున్న గుజరాత్ ప్రభుత్వ ప్రకటన..

|

Oct 18, 2022 | 9:02 PM

గుజరాత్‌లో బిల్కిస్‌ బానో గ్యాంగ్‌రేప్‌ కేసులో నిందితుల విడుదలపై రాజకీయ రగడ రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే నిందితులను విడుదల చేశామన్న గుజరాత్‌ ప్రభుత్వ..

Bilkis Bano case: బిల్కిస్ బానో కేసు.. సంచలనం సృష్టిస్తున్న గుజరాత్ ప్రభుత్వ ప్రకటన..
Bilkis Bano Case
Follow us on

గుజరాత్‌లో బిల్కిస్‌ బానో గ్యాంగ్‌రేప్‌ కేసులో నిందితుల విడుదలపై రాజకీయ రగడ రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే నిందితులను విడుదల చేశామన్న గుజరాత్‌ ప్రభుత్వ వివరణపై విపక్షాలు తీవ్ర విమర్శుల చేస్తున్నాయి. రేపిస్టులకు బీజేపీ ప్రభుత్వం మద్దతు ఉందని కాంగ్రెస్‌ విమర్శించింది.

అవును, గుజరాత్‌లో బిల్కిస్‌ బానో గ్యాంగ్‌రేప్‌ నిందితులను విడుదల చేయడాన్ని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి సమర్థిస్తుంటే, విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, దోషుల విడుదలకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చింది. దోషుల ముందస్తు విడుదలను సీబీఐతో పాటు ప్రత్యేక న్యాయమూర్తి తీవ్రంగా వ్యతిరేకించినా.. కేంద్రం అనుమతి ఇచ్చినట్టు వెల్లడయ్యింది. ఇది ప్రజాస్వామ్యంలో చీకటిరోజుగా కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వి చెప్పారు. ఒకవైపు బేటీ బచావో బేటీ అంటూనే రేపిస్ట్‌లను విడుదల చేయడమేంటని ప్రశ్నించారాయన. మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నవంబర్‌ 29న విచారణ చేపడుతుంది. సత్ర్పవర్తన కారణంగానే బిల్కీస్‌ బానో లైంగిక దాడి కేసులో దోషులను విడుదల చేశామని గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడంపై విపక్షాలు భగ్గుమన్నాయి.

దోషులు 14 ఏండ్లు జైలు శిక్ష అనుభవించారని, వారి ప్రవర్తన మెరుగ్గా ఉండటంతో విడుదల చేశామని సర్వోన్నత న్యాయస్ధానం ఎదుట దాఖలు చేసిన అఫిడవిట్‌లో గుజరాత్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని కూడా అఫిడవిట్‌ పేర్కొంది.. బీజేపీ రేపిస్టులను ఎందుకు హీరోలుగా ట్రీట్‌ చేస్తోందని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దేశ మహిళలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. బిల్కీస్‌ బానో కేసులో దోషులను విడుదల చేయడం పట్ల శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఎంఐఎం ప్రతినిధి వారిస్‌ పఠాన్‌ కూడా బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిజాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..