‘ఉల్లి దండతో వచ్చా.. రూ. వంద పెట్టి కొన్నా’

ఉల్లి కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. కేజీ ఆనియన్స్‌ వంద రూపాయలకు చేరి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఉల్లిగడ్డ పేరు ఎత్తాలంటేనే హడలిపోతున్నారు. ఐతే ప్రభుత్వాలు మాత్రం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి 35రూపాయలకే అమ్ముతున్నామని చెబుతున్నా అందరికీ అందడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి కారణమవుతున్నాయి ఉల్లి ధరలు. ఐతే బీహార్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెరుగుతున్న కూరగాయల ధరలను ఎత్తి చూపాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యే ఉల్లిపాయల […]

'ఉల్లి దండతో వచ్చా.. రూ. వంద పెట్టి కొన్నా'
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 27, 2019 | 5:29 PM

ఉల్లి కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. కేజీ ఆనియన్స్‌ వంద రూపాయలకు చేరి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఉల్లిగడ్డ పేరు ఎత్తాలంటేనే హడలిపోతున్నారు. ఐతే ప్రభుత్వాలు మాత్రం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి 35రూపాయలకే అమ్ముతున్నామని చెబుతున్నా అందరికీ అందడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి కారణమవుతున్నాయి ఉల్లి ధరలు.

ఐతే బీహార్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెరుగుతున్న కూరగాయల ధరలను ఎత్తి చూపాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యే ఉల్లిపాయల దండ ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు. “కిలో 100 రూపాయలు పెట్టి ఈ ఉల్లిపాయలు కొనుగోలు చేశానని చెప్పుకొచ్చారు రాజాపకర్‌ ఎమ్మెల్యే శివచంద్రరామ్‌. మెడలో ఉల్లిపాయలతో అలంకరించిన దండతో రాగానే అక్కడున్న ఫోటోగ్రాఫర్స్‌ క్లిక్‌ మనిపించారు.

ప్రభుత్వం తక్కువ ధరకు అందిస్తున్నామని చెబుతున్నా అలాంటి స్టాల్‌ నేనెక్కడా చూడలేదు. గౌరవప్రదమైన ముఖ్యమంత్రి ఈ దృశ్యాన్ని చూడాలనే ఉల్లిపాయల దండతో శాసనసభలోకి అడుగుపెడుతున్నానని కామెంట్‌ చేశారు. 50రూపాయల కన్నా తక్కువ పలికే ఉల్లిపాయలు వంద రూపాయలు పలుకుతుండటంతో సామాన్యులు ఉల్లిపాయలను మరిచిపోవాల్సివస్తోందంటున్నారు.  అధికారంలో ఉన్న వారు వాగ్ధానాలు చేయడమే కానీ అమలుచేయడం లేదని నితీష్‌కుమార్‌పై మాటల దాడి చేశారు.