అక్కడ 12 పాసైతే రూ.25,000.. డిగ్రీ పూర్తి చేస్తే రూ.50 వేలు.. ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

|

Feb 04, 2021 | 4:24 PM

ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం వెల్లడించింది.

అక్కడ 12 పాసైతే రూ.25,000.. డిగ్రీ పూర్తి చేస్తే రూ.50 వేలు..  ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
Follow us on

Bihar government financial assistance : బీహార్ విద్యార్థినిలకు గుడ్‌న్యూస్.. బాలికలు చదువు పూర్తి చేస్తే చాలు.. వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందనుంది. ఈ మేరకు బీహార్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇంటర్ పాసయిన విద్యార్థినులకు రూ. 25 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థినులకు రూ. 50 వేలు అందజేయనున్నట్లు ప్రకటించింది.

విద్యార్థినిలకు ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ పథకం కింద ఈ నగదు మొత్తాన్ని అందజేయనున్నారు. 2021 ఏప్రిల్ ఒకటి అనంతరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాక ఈ మొత్తాలను విద్యార్థినులకు అందజేయనున్నారు. విద్యార్థినుల్లో విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బీహార్ రాష్ట్రంలో విద్యాభ్యాసం చాలా తక్కువ. ముఖ్యంగా బాలికల్లో చదువు అంతంత మాత్రమే. దీంతో వారిలో విద్యలో వెనుకబాటుతనానని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది బీహార్ రాష్ట్ర సర్కార్.

గతంలో 10 పాసయిన విద్యార్థినులకు రూ. 10 వేలు, డిగ్రీ పాసయిన విద్యార్థినులకు రూ. 25 వేలు అందజేసేవారు. ఇకపై ఈ మొత్తాలను పెంచుతూ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీహార్ రాష్ట్ర మంత్రి మండలి  సమావేశంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంపై నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి విద్యార్థి ప్రోత్సాహన్ యోజన పథకం కింద 33,66 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించేందుకు ‘బీహార్ అత్యవసర సహాయ నిధి’ నుంచి రూ. 34 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతినిచ్చారు. ఈ పథకంలో మెట్రిక్, ఇంటర్ ఫస్ట్ క్లాసులో పాసయిన విద్యార్థులకు రూ. 15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు.

ఇదీ చదవండి… అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై రాష్ట్ర సర్కార్ కసరత్తు.. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష