Bihar Elections: వెనుకంజలో తేజస్వి యాదవ్.. తేజ్ ప్రతాప్ ఊసే లేదు.. లాలూ కుమారుల పరిస్థితి ఏంటంటే..

బిహార్‌లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. బిహార్ అసెంబ్లీలోని 243 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, జేడీయూ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ, జేడియూ 189 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.. మహాఘట్‌బంధన్ కేవలం 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. అయితే, అతిపెద్ద పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేదు..

Bihar Elections: వెనుకంజలో తేజస్వి యాదవ్.. తేజ్ ప్రతాప్ ఊసే లేదు.. లాలూ కుమారుల పరిస్థితి ఏంటంటే..
Lalu Family

Edited By: TV9 Telugu

Updated on: Nov 14, 2025 | 11:49 AM

బిహార్‌లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. బిహార్ అసెంబ్లీలోని 243 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, జేడీయూ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ, జేడియూ 189 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.. మహాఘట్‌బంధన్ కేవలం 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.. అయితే, అతిపెద్ద పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేదు.. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్.. ఇద్దరు కొడుకుల భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ రాఘోపూర్‌లో వెనుకంజలో ఉండగా.. మహువా నుంచి పోటీ చేస్తున్న జనశక్తి జనతాదళ్ (జెడీ) జాతీయ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు.

తేజస్వి యాదవ్ వెనుకంజ..

రఘోపూర్‌లో తేజస్వి యాదవ్ 3,016 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.. మొదటి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపులో స్థిరంగా ముందంజలో ఉన్న తర్వాత, మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్‌లో మూడు, నాలుగు రౌండ్లలో వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ముందంజలో ఉన్నారు.

తేజ్ ప్రతాప్ యాదవ్ ఊసేలేదు..

మూడు రౌండ్ల తర్వాత LJP (RV) అభ్యర్థి సంజయ్ కుమార్ సింగ్ RJD అభ్యర్థి ముఖేష్ కుమార్ రౌషన్ కంటే 3,520 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ECI ప్రకారం, తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రస్తుతం సింగ్, రౌషన్, AIMIM అభ్యర్థి అమిత్ కుమార్ కంటే నాల్గవ స్థానంలో ఉన్నారు.

ఆర్జేడీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత.. తేజ్ ప్రతాప్ యాదవ్ జనశక్తి జనతాదళ్ (జెడీ) ను స్థాపించి పోటీలో నిలిచారు. ఆ పార్టీ ఎక్కడకూ ప్రభావం చూపలేదు.. తేజ్ ప్రతాప్ యాదవ్ వైశాలి జిల్లాలోని మహువా నుంచి పోటీ చేయడంతో.. ఈ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ప్రభావం మాత్రం చూపలేదు.. లాలూ 2వ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అసలు పోటీలో కూడా కనిపించలేదు.. తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ చేసిన మహువాలో ఎల్జేపీ (రాంవిలాస్) అభ్యర్థి సంజయ్ కుమార్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో కొనసాగుతున్న ఆర్జేడీ అభ్యర్థి ముకేశ్ కుమార్ రౌషన్ కొనసాగుతున్నారు.

బీహార్ ఎన్నికల ఫలితాలు ట్రెండ్స్ చూడండి..