Bihar CM Nitish Kumar: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసుల అంశంపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోలీసులు ఎవరైనా మద్యం తాగి విధుల్లోకి వస్తే వారిని పర్మనెంట్‌గా ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు ఎవరైనా తాగి కనిస్తే వారిని తక్షణమే డిస్మిస్ చేయాలంటూ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
అంతేకాదు.. రాష్ట్రంలో పోలీసులంతా తాము మద్యం తాగబోమని ప్రతిజ్ఞ కూడా చేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. బిహార్‌లో సంపూర్ణ మధ్య నిషేధం విధిస్తూ 2016లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేయడానికే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, గ్రామాల్లోనూ పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేసే బాధ్యతను గ్రామ చౌకిదార్లు అప్పగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తూ పట్టుబడితే దానికి బాధ్యులుగా చౌకీదారులను చేయాలని ఉన్నతాధికారులను సీఎం నితీష్ ఆదేశించారు.
Also read:
Maharashtra Corona Update: మహారాష్ట్రాలో తగ్గుముఖం పట్టని కరోనా మహమ్మారి.. పెరుగుతున్న కేసులు
జోగులాంబ అమ్మవారి సన్నిధిలో సీఎం కేసీఆర్ కుటుంబం.. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు