
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో గురువారం (నవంబర్ 20) నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కొత్త మంత్రివర్గంలోకి ఇరవై ఆరు మంది మంత్రులు చేరారు. ప్రమాణ స్వీకారం తర్వాత, సామ్రాట్ చౌదరి మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ సిన్హా తరువాత సామ్రాట్, విజయ్ ఇద్దరూ వరుసగా రెండవసారి ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు, అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేదికపై ఉన్నారు.
బీహార్ ముఖ్యమంత్రిగా ఇది ఆయన 10వ సారి. ఆయనతో పాటు, మరో 26 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వంలో కుదిరిన మంత్రివర్గ ఒప్పందం ప్రకారం, స్పీకర్‌తో పాటు 17 మంత్రి పదవులను బీజేపీ దక్కించుకుంది. జెడియు కోటా నుండి పదిహేను మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) కు ఇద్దరు మంత్రులు, జితన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం), ఉపేంద్ర కుష్వాహా పార్టీ (ఆర్ఎల్ఎం) కు ఒక్కొక్కరు చొప్పున మంత్రి పదవులు దక్కాయి. నితీష్ తో పాటు, సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా బిజెపి కోటా నుండి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Vijay Choudhary, Bijendra Prasad Yadav, Shrawon Kumar, Mangal Pandey, Dilip Jaiswal, Ashok Choudhary take oath as state ministers in Bihar cabinet at the oath ceremony being held at Patna’s Gandhi Maidan.
(Source: DD News) pic.twitter.com/YBGye0ecMW
— ANI (@ANI) November 20, 2025
సామ్రాట్ చౌదరి
విజయ్ కుమార్ సిన్హా
విజయ్ కుమార్ చౌదరి
బిజేంద్ర ప్రసాద్ యాదవ్
శ్రావణ్ కుమార్
మంగళ్ పాండే
డాక్టర్ దిలీప్ జైస్వాల్
అశోక్ చౌదరి
లేసి సింగ్
మదన్ సాహ్ని
నితిన్ నవీన్
రామ్‌కృపాల్ యాదవ్
సంతోష్ కుమార్ సుమన్
సునీల్ కుమార్
ఎండీ జామా ఖాన్
సంజయ్ సింగ్ టైగర్
అరుణ్ శంకర్ ప్రసాద్
సురేంద్ర మెహతా
నారాయణ్ ప్రసాద్
రామ నిషాద్
లఖేంద్ర కుమార్ రోషన్
శ్రేయసి సింగ్
డాక్టర్ ప్రమోద్ కుమార్
సంజయ్ కుమార్
సంజయ్ కుమార్ సింగ్
దీపక్ ప్రకాష్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది ఎన్డీఏ కూటమి. మొత్తం 243 స్థానాల్లో 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89.. జేడీయూ 85 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 28 సీట్లను గెలుచుకున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం (నవంబర్ 19) జరిగిన బిహార్ NDA ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా నితీష్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. ఇక, బీజేపీ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరి, బీజేఎల్పీ ఉపనేతగా విజయ్‌కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్‌కు అవకాశం దక్కనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..