Watch Video: “ఈ దొంగలకు నేనే సర్దార్.. నాపైన కూడా దొంగలున్నారు” బీహార్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

|

Sep 13, 2022 | 1:18 PM

Bihar Minister: తన వ్యవసాయ శాఖలో చోరీకి పాల్పడని విభాగం ఒక్కటీ లేదని అన్నారు. వ్యవసాయ శాఖ తన నేతృత్వంలో నడుస్తోందని.. కాబట్టి వారందరికీ తానే సర్దార్‌ అంటూ..

Watch Video: ఈ దొంగలకు నేనే సర్దార్.. నాపైన కూడా దొంగలున్నారు బీహార్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Minister Sudhakar Singh
Follow us on

బిహార్ మంత్రి, ఆర్జేడీ నేత సుధాకర్ సింగ్ సంచలన వ్యాక్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. తన శాఖలో ఎంతోమంది దొంగలున్నారని.. వారికి తానే లీడర్ (సర్దార్‌) అంటూ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా తనపైన కూడా కొందరు సర్దార్లు ఉన్నారంటూ జేడీయూ, ఆర్జేడీ అగ్రనేతలను వివాదంలోకి లాగారు. ఆయన చేసిన కామెంట్స్‌తో బీహార్ రాష్ట్ర సంకీర్ణ సర్కార్ ఇరకాటంలోకి పడిపోయింది. తన వ్యవసాయ శాఖలో చోరీకి పాల్పడని విభాగం ఒక్కటీ లేదని అన్నారు. వ్యవసాయ శాఖ తన నేతృత్వంలో నడుస్తోందని.. కాబట్టి వారందరికీ తానే సర్దార్‌ అంటూ సెటైర్లు సంధించారు. తనపైనా ఎంతోమంది సర్దార్లున్నారంటూ వ్యాఖ్య నించారు.

ప్రభుత్వం మారింది. పనిచేసే తీరు మాత్రం అదే అంటూ ప్రకటించారు. ఇప్పటికీ అంతా గతంలోలానే ఉందన్నారు. ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం ఇప్పుడు బీహార్ ప్రభుత్వంలో కొత్త వివాదానికి తెరలేపింది.బిహార్‌ విత్తన సంఘంలో జరుగుతోన్న అవినీతిని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆదుకుంటామని చెప్తూ.. ఆ సంఘం రూ.200 కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు.

2013లో నీతీశ్‌ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయనపై బియ్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలున్నాయి. బిహార్‌లో నీతీశ్‌ కుమార్ జేడీయూ పార్టీ ఇటీవలే బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలో సంకీర్ణ సర్కార్ బీహార్‌లో కనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం