పిడుగు పాటుకు 22 మంది మృతి..

బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 24 గంటల వ్యవధిలోనే పిడుగుపాటుకు గురై 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. అసమ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు...

పిడుగు పాటుకు 22 మంది మృతి..

Edited By:

Updated on: Jun 25, 2020 | 4:32 PM

బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 24 గంటల వ్యవధిలోనే పిడుగుపాటుకు గురై 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. అసమ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, బక్సర్‌లో నలుగురు, ఔరంగాబాద్‌లో ఇద్దరు, నలందలో ఇద్దరు, జుమ్రుయిలో ఒక్కరు పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కాగా బీహార్‌లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ.. బీహార్‌లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సేవలకు తప్ప బయటకు ఎవరూ రావద్దని హెచ్చరించారు.

Read More: 

ఫెయిర్&లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం.. ‘ఫెయిర్’ తొలగింపు..

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. వంతెన పై నుంచి పడడంతో భారీ ధ్వంసం..

కరోనా ఉధృతి.. ధైర్యంగా ఉండాలంటూ నాగ్ ఆసక్తకిర ట్వీట్..

దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!

Follow Us