ఢినార్కో టెర్రర్‌పై ఉక్కుపాదం కేంద్ర ప్రభుత్వం. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్ ఉంది. దీంతోపాటు 10కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ రూ.1200కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ మాదకద్రవ్యాల దందాను విదేశీయులు నడిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను ఛేదించి ఇద్దరు ఆఫ్ఘన్ జాతీయులను అరెస్టు చేసింది. ఈ సిండికేట్ నార్కో టెర్రరిజంతో సంబంధం కలిగి ఉంది. ఇది డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బును భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లుగా సమాచారం.
అఫ్గానిస్థాన్‌కు చెందిన ముస్తాఫా స్టానిక్జా, రహీముల్లా రహీమ్ 2016 నుంచి భారత్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచే డ్రగ్స్ రాకెట్‌ను నడిపిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. విదేశాల్లో తయారుచేసిన ఈ మెథ్‌ను ఢిల్లీకి తీసుకువస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఢిల్లీలోని కాలిందికుంజ్ మెట్రో స్టేషన్ వద్ద ఆ ట్రక్‌ను స్వాధీనం చేసుకొని వీరిద్దరినీ అరెస్టు చేశారు.
In a major crackdown, Spl Cell has busted a transnational synthetic drug cartel; 2 Afghan Nationals nabbed. Highest ever seizure of 312.5 kg party drug methamphetamine & 10 kg high purity heroin; worth ₹1200Cr in international mkt. Luxury cars also seized. @CellDelhi pic.twitter.com/iPZjsgzx0k
— Delhi Police (@DelhiPolice) September 6, 2022
పోలీసులు ఏం చెప్పారు?
ఆఫ్ఘన్ జాతీయులు ఇద్దరూ శరణార్థులుగా భారతదేశంలోనే ఉంటున్నారు. వారి వీసాలను రెండుసార్లు పొడిగించారని స్పెషల్ సీపీ హెచ్‌జిఎస్ ధాలివాల్ తెలిపారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం వీటిని పర్యవేక్షిస్తోంది. ఇంతలో నిఘా వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా, పోలీసులు కాళింది కుజ్ సమీపంలో కారును అడ్డగించి, ఆఫ్ఘన్ పౌరులు ముస్తఫా మరియు రహీమ్ ఉల్లాలను అరెస్టు చేశారు. రహీమ్ మరియు ముస్తఫాను పోలీసులు విచారించగా, మిగిలిన మెథాంఫెటమైన్ మరియు హెరాయిన్‌లను యుపిలోని నోయిడా మరియు లక్నో నుండి స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం