AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాట కరవు.. మహారాష్ట్రలో వరదలు.. ఏమిటీ వింత ?

దేశంలో రెండు పెద్ద రాష్ట్రాల్లో ఏర్పడుతున్న విచిత్రమైన వాతావరణ పరిస్థితులు అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజలను అయోమయంలో, ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. తమిళనాట నీటి ఎద్దడితో ప్రజలు సతమవుతుంటే.. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడులో.. ముఖ్యంగా రాజధాని చెన్నైలో నెలరోజులుగా కనీవినీ నీటి ఎద్దడి నెలకొంది. ఇంతటి ‘ విపత్కర ‘ పరిస్థితిని ఈ మధ్య కాలంలో ప్రజలు ఎదుర్కోలేదు. చెన్నైకి నీటిని అందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లు.. పూజల్, చోళవరం, […]

తమిళనాట కరవు.. మహారాష్ట్రలో వరదలు.. ఏమిటీ వింత ?
Pardhasaradhi Peri
|

Updated on: Jul 03, 2019 | 11:29 AM

Share

దేశంలో రెండు పెద్ద రాష్ట్రాల్లో ఏర్పడుతున్న విచిత్రమైన వాతావరణ పరిస్థితులు అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజలను అయోమయంలో, ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. తమిళనాట నీటి ఎద్దడితో ప్రజలు సతమవుతుంటే.. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడులో.. ముఖ్యంగా రాజధాని చెన్నైలో నెలరోజులుగా కనీవినీ నీటి ఎద్దడి నెలకొంది. ఇంతటి ‘ విపత్కర ‘ పరిస్థితిని ఈ మధ్య కాలంలో ప్రజలు ఎదుర్కోలేదు. చెన్నైకి నీటిని అందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లు.. పూజల్, చోళవరం, చెంబరబక్కం, పూండి పూర్తిగా ఎండిపోయాయి. నైరుతి రుతు పవనాలు ఈ రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావాన్నీ చూపలేకపోయాయి. పట్టణీకరణ సరిగా జరగకపోవడం, పాలనా, ప్రభుత్వాల నిర్లక్ష్యం, జనాభా పెరుగుదల, వరుసగా వఛ్చిన తుపానుల ప్రభావం ఇందుకు కారణమవుతున్నాయి. ఫణి వంటి తుపాను వల్ల కొన్ని రాష్ట్రాలు ప్రయోజనం పొందితే.. గాలిలోని తేమను హరించుకుపోయి తీవ్రమైన ఎండలు, నీటి ఎద్దడితో కొన్ని రాష్ట్రాలు అల్లాడాయి. దీని ఎఫెక్ట్ ముఖ్యంగా తమిళనాడులో పడి వర్షాభావ పరిస్థితి నెలకొంది.చెన్నైలో మంచినీటిని అందించలేక హోటళ్లు సైతం మూత పడగా.. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పని చేయాల్సిందిగా కోరాయంటే సిచువేషన్ ఎంత ఘోరంగా మారిందో అర్థమవుతోంది.

అసలు గత జనవరిలోనే భారత వాతావరణ శాఖ దేశంలో వర్షపాత పరిస్థితిపై హెచ్చరించింది. . ఈ సారి నైరుతి రుతు పవనాలు మందగమనంగా, బిలో నార్మల్ గా ఉంటాయని, కేరళ, తప్ప తమిళనాడు, రాయలసీమ, కొంతవరకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావచ్ఛునని పేర్కొంది.

ఇక మహారాష్ట్రలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత ఏడాదిలోనే ఈ రాష్ట్రంలో ..ముఖ్యంగా ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. కేవలం నాగపూర్ లోనే జులై 6 న ఆరు గంటల్లో 263. 5 మీ.మీ. వర్షంపడిందని అంచనా. 2017 లో కూడా జులై 26 న 24 గంటల్లో 944. 5 మీ.మీ. వర్షపాతం నమోదైంది.తాజాగా ఈ రెండు మూడు రోజుల్లోనే 500 మీ.మీ. కు పైగా ముంబైలో వర్షపాతం నమోదైంది. గోడలు కూలి, కొందరు, తివారే డ్యాం కు గండి పడి మరికొందరు మృతి చెందగా..అనేకమంది గాయపడ్డారు. మంగళవారం బడులకు సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. పలు రైలు, విమాన సర్వీసులను రద్దు చేయడమో, దారి మళ్లించడమో చేశారు. పశ్చిమబెంగాల్ లో కురిసిన వర్షాలు, వరదల ప్రభావం ఈ రాష్ట్రం మీద ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు భావిస్తూ వచ్చారు.. . డ్రైనేజీ సిస్టం సరిగా లేకపోవడం. ఉత్తర శివారు ప్రాంతాల్లో ప్రణాళికా బధ్ధ అభివృధ్ది జరగకపోవడం, మితి నది, మాహిమ్ క్రీక్ నది పొడవునా ఎకో సిస్టంలు దెబ్బ తినడం, అక్రమ నిర్మాణాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.

ముంబై మహానగరంలో మ్యాన్ హొల్స్ ని సరిగా మూసివేయకపోవడం, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, జనాభా పెరుగుదల వంటివి ఈ ఉత్పాతానికి ప్రధాన కారణమవుతున్నాయి. క్లైమేట్ చేంజ్ ప్రభావం కూడా ఉందన్నది ఓ అంచనా. ముంబై నుంచి భువనేశ్వర్ వరకు.. దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అరేబియా సముద్రంలో తరచూ ఏర్పడే తుపానులు, వాయుగుండాల ప్రభావం కూడా మహారాష్ట్రపై ఎక్కువగా ఉంది.