గత కొన్ని రోజులుగా కెనడాలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న భారతీయలకు ఊరట లభించింది. పంజాబ్‌కు చెందిన 700 మంది భారతీయ విద్యార్థుల్ని ఇండియాకు పంపించడాన్ని కెనడా ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి నోటీసులు వచ్చేదాక వాళ్లు కెనడాలో ఉండేందుకు అవకాశం కల్పించింది. నకీలీ ఆఫర్ లెటర్లతో చదువుకునేందుకు లవ్ ప్రీత్ సింగ్ తో పాటు ఇతర విద్యార్థులు కెనడాకు వచ్చారని కెనడియన్ బోర్టర్ సర్వీసు ఏజెన్సీ విచారణలో తేలింది. జూన్ 13లోగా కెనడా వీడి వెళ్లిపోవాలంటూ 700 మంది వరకు విద్యార్థులకు అధికారులు నోటీసులు అందజేశారు. సంస్థ చేసిన తప్పు వల్ల తాము మోసపోయామని.. తాము బాధితులమని దేశం విడిచి వెళ్లబోమంటూ కొన్నిరోజులుగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.
జలంధర్‌కు చెందిన కన్సల్టెంట్ బ్రిజేష్ మిశ్రా ఆరు సంవత్సరాల క్రితమే కెనడాలోని కాలేజీలు, యూనివర్సిటీల నుంచి నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించి విద్యార్థుల్ని అక్కడికి పంపారు. మరో విషయం ఏంటంటే వీటిని కెనడా రాయబార కార్యాలయం కూడా కాలేజీలు ఇచ్చిన లెటర్స్ నకిలీవని గుర్తించలేకపోయాయి. విద్యార్థులు కళాశాలలకు వెళ్లేదాక అవి ఫేక్ అని ఎవ్వరకీ తెలియదు. చివరికి కొందరు విద్యార్థులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు విచారించగా కళాశాల ఆఫర్ లెటర్స్ ఫోర్జరీ అని తేలింది. నిందితుడు బ్రిజేష్ మిశ్రాకు చెందిన ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్‌ను అధికారులు రద్దు చేశారు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..