Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం.. హై అలెర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకుంది. భారీ పేలుడుతో నగరం ఒక్కసారిగా వణికింది. ఎర్రకోట మెట్రోస్టేషన్‌ సమీపంలో కారులో పేలుడు సంభవించడంతో పలు వాహనాలకూ మంటలు అంటుకున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం.. హై అలెర్ట్
Delhi Blast

Updated on: Nov 10, 2025 | 9:08 PM

ఢిల్లీలో భారీ పేలుడుతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకుంది. ఎర్రకోట దగ్గర కారులో పేలుడు సంభంవించింది. మెట్రోస్టేషన్‌ దగ్గర నిలిపిన కారు నుంచి బ్లాస్ట్ జరగడంతో.. జనం భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. పలువురికి గాయాలు అవ్వగా, ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి.  పేలుడుపై పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది చేరుకుని.. మంటలు ఆర్పారు. సాయంత్రం 6.52 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. తాజాగా అప్ డేట్స్ ప్రకారం.. ఈ పేలుడు కారణంగా 8 మంది చనిపోయినట్లు సమాచారం అందుతుంది. గాయపడ్డ వారికి ఎల్ ఎన్ జే పీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలంలో ఫోరెన్సిక్, స్పెషల్ సెల్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

ఢిల్లీ శివార్లలో ఇవాళే ఉగ్ర కుట్ర భగ్నం చేశారు పోలీసులు. ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఈ బ్లాస్ట్ జరగడం సంచలనంగా మారింది. పేలుడు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలెర్ట్ ప్రకటించింది కేంద్రం.