దేశం పేరు మార్పు పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

|

Jun 03, 2020 | 6:13 PM

ఇది “ఇండియా”…కాదు “భారత్”.. లేకుంటే “హిందూస్థాన్”‌గా మార్చాలని వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఓ వ్యక్తి గత కొంతకాలం క్రితం కోర్టు ఆశ్రయించారు. “భారత్” అనే పేరును “హిందుస్తాన్”‌గా మార్చడం వల్ల దేశ ప్రజలు గతంలో తాము మరొకరి పాలనలో ఉన్నామనే ఫీలింగ్ నుంచి బయటపడతారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇలాంటి అంశంపై తాము కలగజేసుకునేదిలేదని తేల్చిచెప్పింది. దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం […]

దేశం పేరు మార్పు పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
Follow us on

ఇది “ఇండియా”…కాదు “భారత్”.. లేకుంటే “హిందూస్థాన్”‌గా మార్చాలని వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఓ వ్యక్తి గత కొంతకాలం క్రితం కోర్టు ఆశ్రయించారు. “భారత్” అనే పేరును “హిందుస్తాన్”‌గా మార్చడం వల్ల దేశ ప్రజలు గతంలో తాము మరొకరి పాలనలో ఉన్నామనే ఫీలింగ్ నుంచి బయటపడతారని పిటిషనర్ పేర్కొన్నారు.

ఇలాంటి అంశంపై తాము కలగజేసుకునేదిలేదని తేల్చిచెప్పింది. దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇండియా పేరు మార్పునకు సంబంధించి కోర్టును ఆశ్రయించటం కంటే హోం మంత్రిత్వశాఖకు ఇవ్వాలని సూచించింది. ఆ శాఖ పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ద‌ృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపింది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే దేశం పేరు మార్చటానికి వీలుంటుందని అభిప్రాయపడింది.

భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయంలోనే “ఇండియా” అనే పేరు స్థానంలో “భారత్” లేదా “హిందుస్తాన్” అనే పేరు పెట్టాలని బలంగా వాదన వినిపించిన అంశాన్ని పిటిషన్‌లో గుర్తు చేశారు పిటిషనర్. ఏదేమైనా ఇప్పటికైనా పేరు మార్చాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే ఆ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. ఈ విషయంలో తాము కలగజేసుకోలేమని తెలిపింది. అయితే 2016లోనూ ఇలాంటి పిటిషన్‌ను ఒకటి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది… అప్పుడు కూడా ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.