Covaxin Vaccine: ‘కొవాగ్జిన్‌’ వేయించుకున్నాక తీవ్ర అనారోగ్యానికి గురైతే నష్టపరిహారం: భారత్‌ బయోటెక్‌ ప్రకటన

Covaxin Vaccine: 'కొవాగ్జిన్‌' వేయించుకున్నాక తీవ్ర అనారోగ్యానికి గురైతే నష్టపరిహారం: భారత్‌ బయోటెక్‌ ప్రకటన
Bharat Biotech's Covaxin

Covaxin Vaccine: ప్రపంచ వ్యాప్తంగా ఏడాది నుంచి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చేసింది. ఈ కోవిడ్‌ టీకాపై ఎన్నో అనుమానాలు, సందేహాలు...

Subhash Goud

|

Jan 16, 2021 | 5:00 PM

Covaxin Vaccine: ప్రపంచ వ్యాప్తంగా ఏడాది నుంచి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చేసింది. ఈ కోవిడ్‌ టీకాపై ఎన్నో అనుమానాలు, సందేహాలు నెలకొన్న సందర్భంలో భారత్‌ బయోటెక్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. తాము రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా వేయించుకున్న వ్యక్తుల్లో ఒక వేళ ఏమైనా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే వారికి నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసింది. టీకా కేంద్రాలతో భారత్‌ బయోటెక్‌ శుక్రవారం పంచుకున్న సమ్మతి పత్రంపైన హైలైట్‌ చేసిన అంశాలలో పరిహారం అంశంఒకటి. ప్రభుత్వ ఆస్పత్రులలో టీకాలు వేసే ప్రదేశాలలో కొవాగ్జిన్‌ అందజేయనున్నారు. అయితే టీకా తీసుకున్న అనంతరం తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురైతే ప్రభుత్వ, అధీకృత కేంద్రాలు, ఆస్పత్రులలో చికిత్స అందజేస్తామని ప్రకటించింది.

ఏమైనా సమస్యలు ఎదురైతే..

కాగా, టీకా తీసుకున్న తర్వాత ఏమైనా దుష్ర్పభావాల పరిహారం విషయంలో వ్యాక్సిన్‌ తయారీ దారులు, ప్రభుత్వం మధ్య వివాదం నెలకొంది. ఏమైనా సమస్యలు ఎదురైతే నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్‌ చేస్తుండగా, అన్నింటికీ కంపెనీ బాధ్యత వహిస్తాయని ప్రభుత్వం టీకా కొనుగోలు ఉత్తర్వులో పేర్కొంది.

కొవాగ్జిన్‌ తీసుకున్న వారు పత్రంలో సంతకం చేయాల్సిందే..

కోవిషీల్డ్‌ పొందేవారిలా కాకుండా కొవాగ్జిన్‌ లబ్దిదారులు సమ్మతి పత్రంలో సంతకం చేయాల్సిన ఉంటుంది. ఎందుకంటే ఇది అత్యవసర పరిస్థితులలో షరతులతో కూడిన వినియోగం కోసం ఆమోదించారు. అలాగే టీకా వేయించుకునే ముందు ఫాక్ట్‌-షీల్‌, ప్రతికూల ప్రభావ రిపోర్టింగ్‌ ఫారమ్‌ కూడా అందజేస్తారు. అయితే టీకా వేయించుకున్న మొదటి ఏడు రోజులలో జ్వరం, నొప్పి, దద్దుర్లు వంటి లక్షణాలను గమనించాలి. తొలి రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌లో కోవిడ్‌-19కు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని టీకా ప్రదర్శించిందని భారత్‌ బయోటెక్‌ కంపెనీ చెప్పడంతో సమ్మతి పత్రం ప్రారంభమవుతుంది. కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ సమర్ధత డేటా ఇంకా వెల్లడించలేదు. మూడో దశ ట్రయల్స్‌ ఇంకా కొనసాగుతున్నాయి అని తెలిపింది.

కొవాగ్జిన్‌ గురించి రెండో ఆలోచనలు ఉన్నవారి కోసం బ్యాకప్‌ వ్యాక్సిన్‌ లేదని మహారాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. టీకా సురక్షితం అని మాకు తెలిపారు.. ప్రతి ఒక్కరూ ఫాక్ట్‌ షీట్‌ చదివి సమాచారం తెలుసుకుంటారని ఆశిస్తున్నాం.. అని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో ఒకే రకమైన వ్యాక్సిన్‌ ఉంటుంది కాబట్టి కొవాగ్జిన్‌ కోసం కేటాయించిన కేంద్రాలలో కోవిషీల్డ్‌ ఇవ్వడానికి అవకాశం లేదు అని వెల్లడించారు.

అయితే టీకా అందుబాటులోకి రాకముందు ఎన్నో అనుమానాలు.. అపోహాలు రావడంతో భారత్‌ బయోటెక్‌ పై విధంగా స్పందించి నష్టపరిహారం ఇచ్చే విషయంలో భరోసా ఇచ్చింది. వ్యాక్సిన్‌పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ ముందు జాగ్రత్తగా కేంద్రం సదరు కంపెనీలతో హామీ పత్రం రాయించుకుంది.

Also Read:

Corona Vaccine Launch LIVE: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్..

Strain Virus: భారత్‌లో పెరుగుతున్న స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న కేంద్ర ఆరోగ్యశాఖ

కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ అవసరం, సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా, 6 లేదా 8 వారాల విరామం ఉత్తమం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu