Covaxin Vaccine: పిల్లలపై ప్రభావవంతంగా కోవాగ్జిన్ టీకా.. తుది దశ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్..

|

Dec 30, 2021 | 8:50 PM

Bharat Biotech Covaxin Vaccine: హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ పిల్లలపై కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు

Covaxin Vaccine: పిల్లలపై ప్రభావవంతంగా కోవాగ్జిన్ టీకా.. తుది దశ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్..
Covaxin
Follow us on

Bharat Biotech Covaxin Vaccine: హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ పిల్లలపై కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ఆసుపత్రుల్లో భారత్ బయోటెక్ ట్రయల్స్ నిర్వహించింది. పిల్లలపై నిర్వహించిన కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను భారత్‌ బయోటెక్‌ సంస్థ గురువారం ప్రకటించింది. 2-18 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ (Covaxin) వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలను కనబరిచినట్లు భారత్‌ బయోటెక్‌ సంస్థ వెల్లడించింది. కొవాగ్జిన్‌ తీసుకున్న చిన్నారుల్లో 1.7 రెట్లు యాంటీబాడీలు వృద్ధి చెందాయని పేర్కొంది. అయితే.. ఈ టీకా తీసుకున్న చిన్నారుల్లో ఎలాంటి దుష్పరిణామాలు చూపలేదని స్పష్టం చేసింది. ఈ ట్రయల్స్ లో పిల్లలకు ఈ టీకా సురక్షితమని తేలినట్లు తెలిపింది. దీందోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతున్న విషయం ఈ ప్రయోగాల్లో రుజువైందంటూ పేర్కొంది. ‘పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా జరిపిన ప్రయోగ ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. చిన్నారులకు టీకా సురక్షితం, రోగనిరోధకశక్తి పెంచుతుందనే నిరూపితమైన ఈ సమాచారాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందంటూ భారత్ బయోటెక్ తెలిపింది. పెద్దవారితోపాటు చిన్నారులకు కూడా సురక్షిత, సమర్థమైన టీకాను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని సాధించాం అంటూ అని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.

చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో భారత్‌ బయోటెక్‌ పిల్లలపై కొవాగ్జిన్‌ ప్రయోగాలను జరిపింది. మొత్తం 525 మంది వాలంటీర్లను మూడు విభాగాలుగా విభజించి ప్రయోగాలు చేసింది. మొత్తం వాలంటీర్లలో 374 మందిలో స్వల్ప దుష్ప్రభావాలు మాత్రమే కనిపించగా 78 శాతం మందిలో అవి ఒకరోజులోపే తగ్గిపోయాయని వెల్లడించింది. అయితే.. ఇంజక్షన్‌ ఇచ్చిన చోట సాధారణ నొప్పి మాత్రమే కనిపించిందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. అయితే, ఈ ప్రయోగ ఫలితాలను అక్టోబర్‌ నెలలోనే కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO)కు భారత్‌ బయోటెక్‌ అందజేసింది. అనంతరం 12 నుంచి 18 ఏళ్ల వారికి కొవాగ్జిన్‌ వినియోగించేందుకు డీజీసీఐ అనుమతి ఇచ్చింది. వీటికి సంబంధించిన తుది దశ ప్రయోగాల ఫలితాలను తాజాగా భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

Also Read:

Omicron Variant: భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. 1007కి చేరిన కేసులు.. ఇక తెలంగాణలో ఎన్ని కేసులంటే..!

Covid Vaccine: నాలుగు డోసులు తీసుకున్నా.. కరోనా మహమ్మారి సోకింది..! అక్కడినుంచి వచ్చిన మహిళకు..