Pet Dog: అతని ఇంటి ముందు ఇతడి పెంపుడు కుక్క మల విసర్జన.. గొడవ చినికి, చినికి.. ఓ ప్రాణం

ఇవి అస్సలు తెగని పంచాయితీలు. రెగ్యూలర్‌గా మన కాలనీల్లో కూడా ఇలాంటి గొడవలు చూస్తూనే ఉంటాం. ఎవరో ఒకరు తగ్గితే సరిపోతుంది. అలా కాకుంటేనే ఇలాంటి విపరీత పరిస్థితులు వస్తాయి.

Pet Dog: అతని ఇంటి ముందు ఇతడి పెంపుడు కుక్క మల విసర్జన.. గొడవ చినికి, చినికి.. ఓ ప్రాణం
Accused Pramod- Deceased Muniraj

Updated on: Apr 13, 2023 | 11:26 AM

చిన్న గొడవ చినికి చినికి గాలివనలా మారింది..అది కాస్త గొడవగా మారి..ఆపై అది ఏకంగా హత్యకు దారితీసింది..నిజమే..కుక్క కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ హత్య వరకూ వెళ్లింది..బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది..స్తానికంగా తీవ్ర చర్చకు దారితీసింది..

కర్నాటక రాజధాని బెంగళూరులో సోలదేవనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గణపతి నగర్‌లో నివాసముంటున్న ప్రమోద్‌ ప్రతి రోజూ తన పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లేవాడు. పొరుగున ఉంటే మునిరాజు ఇంటి ముందు ఆ కుక్క మల విసర్జన చేసేది. ప్రమోద్‌ కూడా అక్కడే నిల్చొని సిగరెట్‌ తాగేవాడు. దీనిపై వారిద్దరి మధ్య తరచుగా వాగ్వాదం జరుగుతున్నది.

ఇలాగే ఈ నెల 8న ప్రమోద్‌ యథావిధిగా మునిరాజు ఇంటి ముందు కుక్కతో మల విసర్జన చేయించాడు. దీంతో మునిరాజు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రమోద్‌ తన స్నేహితుడితో కలిసి క్రికెట్‌ బ్యాట్‌తో మునిరాజ్‌ను కొట్టాడు. ఆ దెబ్బలు తాళలేని ఆ వృద్ధుడు చనిపోయాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమోద్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు..కుక్కు కోసం జరిగిన గొడవ ఇలా హత్యకు దారితీయడం హాట్‌ టాఫిక్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం