వామ్మో.. ప్రియురాలి రూపంలో నరరూప రాక్షసి.. ప్రియుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బట్టలిప్పి..
యువకుడు.. ఆ అమ్మాయిని అమితంగా ప్రేమించాడు.. కానీ.. ఆమె అతనిపైనే కక్ష గట్టింది.. కిడ్నాప్ చేయించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బట్టలిప్పి.. అసలు కథను నడిపింది. ప్రియుడ్ని ప్రియురాలు చిత్రహింసలు పెట్టిన ఘటన కేరళలో కలకలం రేపింది. ప్రియుడిని వదిలించుకునేందుకు ఓ ప్రియురాలు..

యువకుడు.. ఆ అమ్మాయిని అమితంగా ప్రేమించాడు.. కానీ.. ఆమె అతనిపైనే కక్ష గట్టింది.. కిడ్నాప్ చేయించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బట్టలిప్పి.. అసలు కథను నడిపింది. ప్రియుడ్ని ప్రియురాలు చిత్రహింసలు పెట్టిన ఘటన కేరళలో కలకలం రేపింది. ప్రియుడిని వదిలించుకునేందుకు ఓ ప్రియురాలు.. మరో వ్యక్తితో కలిసి అతన్ని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. నగ్నంగా తాళ్లతో కట్టేసింది. ఆ తర్వాత సిగరెట్లతో కాల్చుతూ చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో వెలుగుచూసింది. పార్టీ పేరుతో ప్రియుడ్ని తీసుకెళ్లిన లక్ష్మీప్రియ అనే యువతి.. అతన్ని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత అతన్ని గదిలో నగ్నంగా బంధించి.. సిగరెట్లతో కాల్చుతూ చిత్రహింసలు పెట్టింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్రహింసలకు గురి చేసిన ప్రియురాలితోపాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్కాలలోని అయిరూర్‌కు చెందిన యువకుడు ఏప్రిల్ 5న దారుణంగా వేధింపులకు గురయ్యాడు. అతను వర్కాలలోని చెరున్నియూర్‌కు చెందిన లక్ష్మీప్రియతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఆమె అతనితో విడిపోయి మరో యువకుడి ప్రేమలో పడింది. ఆ తర్వాత అతన్ని ఎలాగైనా హింసించాలని ప్లాన్ వేసింది. ఆ తర్వాత లక్ష్మీప్రియ, ఆమె ప్రేమికుడు, మరో స్నేహితుడితో కలిసి యువకుడి ఇంటికి చేరుకుని అతన్ని బయటకు పిలిచి కారులో తీసుకెళ్లింది. వారంతా కారులోనే అతనిపై దాడి చేసి కత్తితో బెదిరించారు.
కారు అలప్పుజకు చేరుకోగానే డ్రైవర్ దిగి అతడి చేతిలో ఉన్న చైన్, మొబైల్, రూ.5000 లాక్కున్నాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బులివ్వాలంటూ దాడికి పాల్పడ్డారు. వారు ఎర్నాకులం బైపాస్ సమీపంలోని ఒక ఇంటికి చేరుకుని, మొబైల్ ఛార్జర్ ఉపయోగించి అతనికి షాక్ ఇచ్చారు. వారు ఇచ్చిన బీరు తాగేందుకు నిరాకరించడంతో బాటిల్‌తో తలపై కొట్టారు. వారు అతని బట్టలిప్పి రికార్డు చేశారు. సిగరేట్లతో కాల్పుతూ చిత్రహింసలు పెట్టారు. రిలేషన్ షిప్ నుంచి వైదొలగాలని, లేకుంటే సోషల్ మీడియాలో విజువల్స్ సర్క్యులేట్ చేస్తానని బెదిరించారు.
తీవ్రగాయాలతో స్పృహతప్పి పడిపోయిన యువకుడిని మరుసటి రోజు వైట్టిల బస్టాప్‌లో వదిలిపెట్టి.. అక్కడి నుంచి పరారయ్యారు. రోడ్డు పక్కన పడి ఉన్న యువకుడిని పోలీసులు కొచ్చి మెడికల్ కాలేజీకి తరలించారు. సమాచారం అందుకున్న బంధువులు అక్కడికి చేరుకుని యువకుడిని వెంజరమూడు గోకులం వైద్య కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వర్కాలకి లక్ష్మీప్రియను ఫోన్ టవర్ లొకేషన్‌పై ఆధారంగా ఆమెను రహస్య ప్రదేశం నుంచి గత రాత్రి అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




