బెంగళూరులో పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు.. సరదా కోసమేనంటున్న విద్యార్థులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

|

Nov 19, 2022 | 6:48 PM

కాలేజీ ఫెస్ట్‌లో తమ అభిమాన జట్టుకు మద్దతు పలుకుతూ రెచ్చిపోయారు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేయడంపై తోటి విద్యార్ధులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

బెంగళూరులో పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు.. సరదా కోసమేనంటున్న విద్యార్థులు.. కేసు  నమోదు చేసిన పోలీసులు
Pro Pakistan Slogans
Follow us on

బెంగళూరులో పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. న్యూ హారిజన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు ఇద్దరు స్టూడెంట్స్‌. కాలేజీ ఫెస్ట్‌లో తమ అభిమాన జట్టుకు మద్దతు పలుకుతూ రెచ్చిపోయారు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేయడంపై తోటి విద్యార్ధులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేస్తోన్న స్టూడెంట్స్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు అంటూ అరుస్తున్న ఇద్దరు విద్యార్ధులను మిగిలిన విద్యార్థులు అడ్డుకున్నారు. వాళ్లతో “జైహింద్‌…” “జై కర్నాటక..” అంటూ చెప్పించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో బెంగళూరుకు చెందిన ఇద్దరు స్టూడెంట్స్‌ని సస్పెండ్‌ చేసింది న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ యాజమాన్యం.

అదే టైమ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఇద్దరు విద్యార్ధులపై కేసు నమోదైంది. అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో రెచ్చగొట్టడం, ప్రజల్లో భయం కలిగించేలా వ్యవహరించారంటూ ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. ఐపీసీ 153, 505(1B) సెక్షన్లను పెట్టారు పోలీసులు

మీడియా కథనాల ప్రకారం, పోలీసులు ఇద్దరు విద్యార్థులకు బెయిల్ మంజూరు చేశారు. వారు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పారు. విద్యార్థులు పాకిస్ధాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తున్నారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

మే 25, 26 తేదీల్లో ఫెస్ట్‌ నిర్వహించేందుకు కళాశాలలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కొంతమంది విద్యార్థులు తమకు ఇష్టమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లు, దేశాల పేర్లను అరుస్తున్నారు. వీరు మాత్రం “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అక్కడే ఉన్న మరో విద్యార్థి తన వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విద్యార్థుల వయసు 17 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటుంది.

వైట్‌ఫీల్డ్ పోలీస్ డిప్యూటీ కమీషనర్ మాట్లాడుతూ.. “ఈ వీడియోను ఈ విద్యార్థుల స్నేహితులలో ఒకరు రికార్డ్ చేశారు. కాలేజీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసి ఫిర్యాదు చేశారు. ముందుగా వీరిని అరెస్ట్ చేసి బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అతను ఉద్దేశపూర్వకంగా చేయలేదని.. అయితే కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం.”

మరిన్ని జాతీయ వార్తల కోసం