గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం (ఆగస్టు 11) అనూహ్యంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పైలట్ ముందుజాగ్రత్త చర్యగా తూర్పు మేదినీపూర్ జిల్లా కోలఘాట్‌లోని ఓ బహిరంగ ప్రదేశంలో హెలికాప్టర్‌ను దించినట్లు అధికారులు తెలిపారు. సీఎం సువేందు డమ్‌డమ్ నుంచి పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

గాల్లో ఉండగానే హైటెన్షన్.. సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! రెప్పపాటులో తప్పిన ముప్పు!
Bengal Cm Suvendu Adhikari

Updated on: Aug 11, 2026 | 3:27 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం (ఆగస్టు 11) అనూహ్యంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పైలట్ ముందుజాగ్రత్త చర్యగా తూర్పు మేదినీపూర్ జిల్లా కోలఘాట్‌లోని ఓ బహిరంగ ప్రదేశంలో హెలికాప్టర్‌ను దించినట్లు అధికారులు తెలిపారు. సీఎం సువేందు డమ్‌డమ్ నుంచి పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

వాతావరణ మార్పులతో అప్రమత్తమైన పైలట్!

సీఎం సువేందు అధికారి కేశ్‌పూర్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్‌కు నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్‌ను సురక్షితంగా కిందకు దించారు. ల్యాండింగ్ అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో కేశ్‌పూర్‌కు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనలో ముఖ్యమంత్రికి ఎలాంటి గాయాలు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

బెంగాల్‌లో వాతావరణ హెచ్చరికలు

ఇదిలా ఉండగా బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలతో పాటు కొన్ని చోట్ల ఉక్కపోత, అధిక తేమ కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం రవాణాపై కూడా పడే అవకాశం ఉండటంతో విమాన, హెలికాప్టర్ ప్రయాణాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఖుదీరామ్ బోస్‌కు నివాళులు

స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జ్ఞాపకార్థం కేశ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం సువేందు అధికారి హాజరు కావాల్సి ఉంది. హెలికాప్టర్ ల్యాండింగ్‌తో ప్రయాణ ప్రణాళికలో మార్పు వచ్చినప్పటికీ.. రోడ్డు మార్గంలో కార్యక్రమానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

అత్యవసర ల్యాండింగ్‌తో ఉత్కంఠ

వర్షాలు, గాలులు, మేఘావృత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ ప్రయాణాల్లో పైలట్లు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. కేశ్‌పూర్ ప్రయాణంలోనూ ఇదే తరహాలో ముందుజాగ్రత్త చర్యగా కోలఘాట్‌లో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా.. సీఎం సువేందు అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ ఘటనతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తదుపరి ప్రయాణాల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us