2024 ఎన్నికలకు మెల్లగా హడావుడి మొదలవుతున్నట్టు కనిపిస్తోంది. రాజకీయ కార్యకలాపాల జోరు క్రమంగా పెరుగుతోంది. ఆయా పార్టీలు ఇప్పటినుంచే ఆ ఎన్నికలకు సన్నద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఏదో ఒక సందర్భంలో మరో మూడేళ్ళలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ త్వరలో తాను ఢిల్లీకి వెళ్తున్నట్టు ప్రకటించారు. హస్తినలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఎన్సీపీ నేత శరద్ పవార్ ను, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సహా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కలుసుకుంటానని వెల్లడించారు. బెంగాల్ ఎన్నికల తరువాత తను ఢిల్లీ వెళ్లలేదని, ఇక రాష్ట్రంలో కోవిడ్ సమస్య కూడా కొంత తగ్గిందని..అందువల్ల దేశ రాజధానికి వెళ్లాలనుకుంటున్నానని ఆమె చెప్పారు. పైగా పార్లమెంటు సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి గనుక ఈ నేతలందరితోనూ భేటీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు.
ఢిల్లీలో నేను నాలుగు రోజులు ఉండవచ్చు..అయితే ఏ తేదీన బయలుదేరతానో ఇంకా నిర్ణయించుకోలేదు అని ఆమె చెప్పారు. ఇక ఇటీవలి వారాల్లో ఢిల్లీలో రాజకీయ సందడి పెరిగింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరిగాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు సార్లు శరద్ పవార్ తో భేటీ అయ్యారు. అలాగే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో కూడా భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చునని ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిని ఆయన ఖండించలేదు. పైగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Nara Lokesh: పోకిరి సినిమాలో బ్రహ్మానందంలా చేశాడు..!! జగన్ పై లోకేష్ సెటైర్లు..!! వీడియో
Huzurabad By-Poll: తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. హస్తినలో హుజూరాబాద్ గెలుపు వ్యూహాలు