“చొరబాటుదారులు సామాను సర్దుకోండి.. అక్రమార్కులను వదిలిపెట్టబోము” : ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ సందడి పెరుగుతోంది. శనివారం (ఏప్రిల్ 11) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్వా నుండి బెంగాల్ ప్రజల మనోభావాలను వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. తన వెనుక ఉన్న జనసమూహాన్ని చూపిస్తూ, "దేశవాసులారా, మీరు బెంగాల్ ప్రజల మనోభావాలను చూడవచ్చు" అని ఆయన అన్నారు.

చొరబాటుదారులు సామాను సర్దుకోండి.. అక్రమార్కులను వదిలిపెట్టబోము : ప్రధాని మోదీ
Pm Modi Katwa Rally

Updated on: Apr 11, 2026 | 9:48 PM

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ సందడి పెరుగుతోంది. శనివారం (ఏప్రిల్ 11) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్వా నుండి బెంగాల్ ప్రజల మనోభావాలను వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. తన వెనుక ఉన్న జనసమూహాన్ని చూపిస్తూ, “దేశవాసులారా, మీరు బెంగాల్ ప్రజల మనోభావాలను చూడవచ్చు” అని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం బీహార్, మహారాష్ట్ర, హర్యానాలలో మనం చూశామని, ఎక్కడైతే అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారో, మహిళలు ఓటు వేయడానికి ముందుకు వచ్చారో, అక్కడ బీజేపీ-ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలిచిందని ప్రధాని మోదీ అన్నారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని పూర్బ బర్ధమాన్ జిల్లా, కట్వాలో ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, “చొరబాటుదారులు తమ సామాను సర్దుకోవడం ప్రారంభించాలి; ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన సమయం. అక్రమ వలసదారులకు సహాయం చేసే వారిని వదిలిపెట్టబోము” అని అన్నారు.

బర్ధమాన్‌లో వేలాది మందితో జరుగుతున్న ఈ ర్యాలీ బెంగాల్‌లో కూడా జరగబోతోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ దృశ్యం మే 4వ తేదీన వెలువడే ఫలితాలకు ఒక ట్రైలర్ లాంటిదన్నారు. “ఈ ఎన్నికలలో మీ ఉత్సాహాన్ని, మీ శక్తిని, మీ సంకల్పాన్ని నేను చూస్తున్నాను… ఇది భయంపై విశ్వాసం సాధించిన విజయానికి ఒక ప్రకటన. బెంగాల్ మార్పునకు సిద్ధంగా ఉంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఇప్పటికే పోలింగ్ జరిగింది. అక్కడ భారీగా ఓటర్లు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఓటు వేశారని” ప్రధాని మోదీ అన్నారు.

టీఎంసీపై ఉన్న భయాన్ని తొలగించి, దానిని విశ్వాసంగా మార్చడమే మోదీ గ్యారెంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ గ్యారెంటీని ఎలా నెరవేరుస్తారనేది బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. అవినీతి, శాంతిభద్రతలపై బీజేపీ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుందని, తద్వారా ప్రతి టీఎంసీ గూండా, ప్రతి అవినీతిపరుడైన ఎమ్మెల్యే, మంత్రిని చట్టపరంగా జవాబుదారీగా చేయవచ్చని ఆయన అన్నారు. ఇది 15 ఏళ్ల క్రూరమైన ప్రభుత్వ పాలనపై పూర్తి వివరాలను అందిస్తుందని ఆయన చెప్పారు.

బెంగాల్‌ను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తామని బీజేపీ ప్రతిజ్ఞ చేసిందని ప్రధాని మోదీ అన్నారు. బెంగాల్ బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. మీకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడానికి ఒక రోడ్‌మ్యాప్ అందులో ఉంది. ఈ అద్భుతమైన మేనిఫెస్టోపై బెంగాల్ బీజేపీ సహచరులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. టీఎంసీ క్రూరమైన ప్రభుత్వంపై ఉన్న భయాన్ని విశ్వాసంగా మార్చడమే మోదీ హామీ. మరి ఈ హామీని ఎలా నెరవేరుస్తారనే… ఈ పూర్తి బ్లూప్రింట్ బీజేపీ మేనిఫెస్టోలో ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us