కోవిద్ కారణంగా తమ తలిదండ్రులను కోల్పోయిన పిల్లలను పీఎం కేర్స్ ఫండ్ నిధుల ద్వారా ఆదుకుంటామంటూ ప్రధానమంత్రి కార్యాలయం చేసిన ప్రకటనను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. అమాయక బాలలకు తక్షణ సాయం అవసరమని, అంతే కానీ ఎప్పుడో 18 ఏళ్ళు వచ్చాక వారికి సాయం చేస్తామనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది మోదీసర్కార్ మరో మాస్టర్ స్ట్రోక్ అని ట్వీట్ చేశారు. ఈ ఫండ్ ద్వారా వారి సంక్షేమానికి నిధులు సకాలంలో అందితే మంచిదేనని, ఇప్పుడు వారికీ తక్షణ సాయం అవసరమని ఆయన అన్నారు. బాలలకు 18 ఏళ్ళు రాగానే వారికి స్టైపెండ్ ఇస్తామన్న హామీ గురించి వారు పాజిటివ్ గా ఫీల్ కావాల్సిందే అని పేర్కొన్నారు. ‘బీ గ్రేట్ ఫుల్..టు పీఎం కేర్స్ ఫర్ ప్రామిస్ ఫ్రీ ఎడ్యుకేషన్’ అని ట్వీట్ చేశారు/. పైగా ఆయుష్మాన్ భారత్ లో చేరితే 50 కోట్లమంది భారతీయుల ఆరోగ్యావసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారని, కానీ అవసరమైనప్పుడు కోవిద్ రోగులకు బెడ్స్,ఆక్సిజన్ ఇవ్వడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
కోవిద్ కారణంగా తమ పేరెంట్స్ ను కోల్పోయిన బాలలకు 18 ఏళ్ళు రాగానే ప్రతి బాలిక లేదా బాలుడికి పీఎం కేర్స్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం నిన్న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అలాగే వారు దగ్గరలోని కేంద్రీయ విద్యాలయ లేదా ప్రైవేటు స్కూల్లో చేరితే వారి పుస్తకాలు, యూనిఫామ్ మొదలైనవాటికి అయ్యే ఖర్చును కూడా భరిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇవి హామీలుగా మిగిలిపోరాదని, అసలు వారికీ తక్షణ సాయం అవసరమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Rang De: నితిన్ కీర్తి సురేష్ రంగ్ దే మూవీ ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే…?? ( వీడియో )
Manchu Vishnu: కూతుళ్లు ఛాలెంజ్ తో మోహన్ బాబు కి షాక్ ఇచ్చిన మంచు విష్ణు… ( వీడియో )