పశ్చిమ బెంగాల్ లో దుర్గాపూజ ఉత్సవాలు, పొలిటికల్ బ్యాటిల్ వేదికలు

| Edited By: Anil kumar poka

Oct 15, 2020 | 11:36 AM

పశ్చిమ బెంగాల్ లో నవరాత్రి ఉత్సవాలను తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ రెండూ  తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోజూస్తున్నాయి. సీఎం మమతా బెనర్జీ నిన్న వర్చ్యువల్ గా 10 జిల్లాల్లో దుర్గాపూజా మండపాలను ప్రారంభించారు.

పశ్చిమ బెంగాల్ లో దుర్గాపూజ ఉత్సవాలు, పొలిటికల్ బ్యాటిల్ వేదికలు
Follow us on

పశ్చిమ బెంగాల్ లో నవరాత్రి ఉత్సవాలను తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ రెండూ  తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోజూస్తున్నాయి. సీఎం మమతా బెనర్జీ నిన్న వర్చ్యువల్ గా 10 జిల్లాల్లో దుర్గాపూజా మండపాలను ప్రారంభించారు. మరో రెండు రోజులు రిమోట్ గా, పర్శనల్ గా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే సమయంలో బీజేపీ సైతం నేనూ తక్కువ తినలేదన్నట్టు ఆర్భాటంగా ఈ పూజా ఉత్సవాలపై ‘తీవ్రంగా’ దృష్టి పెట్టింది. బీజేపీ మహిళా మోర్చా ఈ నెల 22 న నిర్వహించనున్న ఉత్సవాల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొననున్నారు. వచ్ఛే ఏడాది బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు ఇప్పటి నుంచే ఇలా కసరత్తులు మొదలయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న సందర్భంలో మోదీ అప్పుడే ఈ రాష్ట్రానికి వరాల వెల్లువ ప్రకటించిన సంగతి విదితమే. అలాగే పశ్చిమ బెంగాల్ లోనూ ఆయన ఈ రాష్ట్రం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు.