Shocking Video: బర్త్‌ డే పార్టీలో ఫుల్ మాస్ డ్యాన్స్.. ఇంతలో బిగ్ షాక్.. ఆహాకారాలతో అంతా అతలాకుతలం..

Shocking Video: మృత్యువు ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకూ సంతోషంగా, ఆడుతూ పాడుతూ ఉన్న వ్యక్తులు..

Shocking Video: బర్త్‌ డే పార్టీలో ఫుల్ మాస్ డ్యాన్స్.. ఇంతలో బిగ్ షాక్.. ఆహాకారాలతో అంతా అతలాకుతలం..
Man Dance

Updated on: Sep 03, 2022 | 8:50 PM

Shocking Video: మృత్యువు ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకూ సంతోషంగా, ఆడుతూ పాడుతూ ఉన్న వ్యక్తులు.. ఒక్క క్షణంలో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటిదే షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. స్నేహితుడి బర్త్ డే పార్టీ వేడులకు హాజరైన వ్యక్తి.. డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

అవును, స్నేహితుడి బర్త్ డే పార్టీలో ఓ వ్యక్తిని వెంటాడింది మృత్యువు. పార్టీలో డాన్స్‌ చేస్తూ కుప్పకూలాడు. ఉత్తరప్రదేశ్‌‌లోని బరేలిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభాత్‌ ప్రేమి అనే వ్యక్తి తన ఫ్రెండ్‌ విశాల్‌ జన్మదిన వేడుకలకు హాజరయ్యాడు. హోటల్‌లో ఈ బర్త్‌డే పార్టీ జరిగింది. ఫ్రెండ్స్‌ కోరడంతో హోటల్‌లో డాన్స్‌ చేశాడు ప్రభాత్‌.. హిందీ పాటపై చక్కని స్టెప్స్‌ వేశారు. కాని డాన్స్‌ చేస్తుండగానే ఏమయ్యిందో తెలియదు కాని కుప్పకూలాడు. గుండెపోటుతో అతడు చనిపోయాడు. హాస్సిటల్‌కు తీసుకెళ్లినప్పటికి లాభం లేకుండా పోయింది. సీపీఆర్‌ ఇచ్చినప్పటికి ప్రభాత్‌ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన అందరిని షాక్‌కు గురిచేసింది. కాగా, ప్రభాత్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..