మోదీని పొగిడిన ‘సుప్రీం’ జడ్జి…బార్ అసోసియేషన్ అసంతృప్తి

| Edited By: Anil kumar poka

Feb 26, 2020 | 6:36 PM

ప్రధాని మోదీని సుప్రీంకోర్టు జడ్జి అరుణ్ మిశ్రా అదేపనిగా పొగడడాన్ని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఖండించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల ఈ విధమైన వైఖరి..జుడీషియరీ నిష్పక్షపాతపూరితంగా

మోదీని పొగిడిన సుప్రీం జడ్జి...బార్ అసోసియేషన్ అసంతృప్తి
Follow us on

ప్రధాని మోదీని సుప్రీంకోర్టు జడ్జి అరుణ్ మిశ్రా అదేపనిగా పొగడడాన్ని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఖండించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల ఈ విధమైన వైఖరి..జుడీషియరీ నిష్పక్షపాతపూరితంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని నీరుగారుస్తుందని ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ లలిత్ బాసిన్ అన్నారు. ఉన్నత న్యాయస్థాన జడ్జీలు రాజ్యాంగ మౌలిక సూత్రాల మేరకు నడచుకుంటారని, పక్షపాత రహితంగా ఉంటారనే ప్రజలు భావిస్తారని, కానీ ఈ జడ్జి ఇలా మాట్లాడడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థకు న్యాయమూర్తులు దూరంగా ఉండాలి.. తాము నిష్పాక్షికంగా, ఫెయిర్ గా వ్యవహరించవలసి ఉంటుంది. అలా తాము చేసే ప్రమాణానికి బధ్ధులుగా ఉండాలి అని భాసిన్ అన్నారు. కానీ జస్టిస్ అరుణ్ మిశ్రా ఇందుకు విరుధ్ధంగా ప్రవర్తించారు అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నెల 22 న జరిగిన  ‘ఇంటర్నేషనల్ జ్యూడిషియల్ కాన్ఫరెన్స్-2020’ లో జస్టిస్ అరుణ్ మిశ్రా ‘ఓట్ ఆఫ్ థాంక్స్’ చెబుతూ.. ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు. మోదీ అంతర్జాతీయంగా ఎంతో ప్రాచుర్యం పొందారని, వెర్సటైల్ జీనియస్ అని, ఆయన గ్లోబల్ గా ఆలోచిస్తూ.. లోకల్ గా పని చేస్తారని వ్యాఖ్యానించారు.