Bank Holidays March 2021: మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవులు.. రెండు రోజులు సమ్మె.. పూర్తి వివరాలు

|

Feb 27, 2021 | 3:26 PM

Bank Holidays March 2021: మార్చి నెలలో బ్యాంకుకు సంబంధించి లావాదేవీలు జరుపుకొనే వారికి అలర్ట్‌. మార్చిలో మొత్తం 8 రోజులు బ్యాంకుల..

Bank Holidays March 2021: మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవులు.. రెండు రోజులు సమ్మె.. పూర్తి వివరాలు
Follow us on

Bank Holidays March 2021: మార్చి నెలలో బ్యాంకుకు సంబంధించి లావాదేవీలు జరుపుకొనే వారికి అలర్ట్‌. మార్చిలో మొత్తం 8 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. మార్చిలో వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

అయితే మార్చి నెలలో మొత్తం 31 రోజులు ఉండగా, అందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు. వీటితో పాటు మహాశివరాత్రి, హోళీ పండగలు కూడా ఉండటంతో మరో రెండు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
అలాగే ఆదివారాలు ఎప్పుడు వచ్చాయో పరిశీలిస్తే మార్చి 7, మార్చి 14, మార్చి 21, మార్చి 28 తేదీల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. ఇక మార్చి 13న రెండో శనివారం, మార్చి 27న నాలుగో శనివారం వచ్చాయి. ఈ రెండురోజులు కూడా బ్యాంకులకు సెలవే. వీటితో పాటు మార్చి 11న మహాశివరాత్రి, మార్చి 29వ తేదీన హోళీ పండగ సందర్భంగా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. మార్చి 27 నుంచి 29వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక ఈ ఎనిమిది రోజుల పాటు మరో రెండు రోజులు కూడా బ్యాంకులు మూత పడే అవకాశాలు ఉన్నాయి. తొమ్మిది బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్లు మార్చి 15 నుంచి సమ్మెను ప్రకటించాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను చేపట్టాయి.

అయితే ముందుగా ప్రకటించినట్లు సమ్మె జరిగినట్లయితే మరో రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీనిపైఇంకా ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. బ్యాంకులు మార్చి 15,16 తేదీల్లో సమ్మెకు దిగితే మార్చి 14న ఆదివారం వచ్చింది కాబట్టి వరుసగా మూడు రోజులు బ్యాంకులు తెరుచుకోలేవు. అందుకే బ్యాంకు లావాదేవీలు జరిపేవారు ముందస్తుగా ప్లాన్‌ చేసుకుని బ్యాంకు పనులు చేసుకోవడం బెటర్‌. అయితే పైన వివరించినవన్నీ హైదరాబాద్ సర్కిల్‌లోని బ్యాంకులకు ఉండే సెలవులు. ప్రాంతాలను, సర్కిళ్లను బట్టి ఈ సెలవులు మారుతుంటాయి. అలాగే బ్యాంకులకు ప్రతీ నెల ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తన అధికారిక వెబ్‌ సైట్‌లో వివరాలు ఉంటాయి.

PAN CARD: మీరు ఇలా చేయకపోతే మీ పాన్‌ కార్డు రద్దు.. రూ.10 వేల జరిమానా.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు