ఓరీ దేవుడో ఇదేం బాదుడురా సామీ.. మెట్రోలో బ్యాగు తీసుకెళితే రూ. 30 ఛార్జ్ చెల్లించాల్సిందేనట..

మెట్రోలో అతను ఒక సూట్‌కేస్‌తో ప్రయాణిస్తున్నాడు. అంతలోనే అతన్ని అడ్డుకున్నారు మెట్రో సిబ్బంది. తన లగేజీ పరిమితిని మించి ఉందని, అదనపు ఛార్జ్‌ చెల్లించాల్సిందిగా చెప్పారు. ఇందుకోసం రూ. 30 చెల్లించాలని మెట్రో సిబ్బంది ఆ యువకుడిని నిలిపివేశారు. ఇదే విషయమై మెట్రో సిబ్బంది, ఆ యువకుడికి మధ్య చాలా సేపటి వరకు వాగ్వాదం నడించింది. కానీ, సిబ్బంది వినలేదు..

ఓరీ దేవుడో ఇదేం బాదుడురా సామీ.. మెట్రోలో బ్యాగు తీసుకెళితే రూ. 30 ఛార్జ్ చెల్లించాల్సిందేనట..
Bangalore Metro

Updated on: Aug 19, 2025 | 10:53 AM

బెంగళూరు మెట్రోకు దేశంలోనే అత్యంత ఖరీదైన మెట్రోగా పేరుంది. నమ్మ మెట్రోలో భారీ సామానుకు విడిగా ఛార్జ్ చేసే విధానంపై బెంగళూరు ప్రయాణీకుడు ఒకరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తాడు. తన ప్రయాణ సమయంలో సూట్‌కేస్ తీసుకెళ్లడానికి రూ. 30 చెల్లించమని మెట్రో సిబ్బంది తనను ఒత్తిడికి గురిచేశారంటూ అతడు ఎక్స్‌లో పేర్కొన్నాడు. లగేజీ ఛార్జ్‌ టికెట్‌ ఫోటో కూడా షేర్‌ చేశాడు.. దీంతో వెంటనే ఈ పోస్ట్ విస్తృత చర్చకు దారితీసింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారి వేగంగా చక్కర్లు కొట్టడంతో దీనిపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.

బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన అవినాష్ చంచల్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్ లో తన మెట్రో అనుభవాన్ని తెలియజేస్తూ పోస్ట్‌ పెట్టాడు. బెంగళూరు మెట్రోలో అతను ఒక సూట్‌కేస్‌తో ప్రయాణిస్తున్నాడు. అంతలోనే అతన్ని అడ్డుకున్నారు మెట్రో సిబ్బంది. తన లగేజీ పరిమితిని మించి ఉందని, అదనపు ఛార్జ్‌ చెల్లించాల్సిందిగా చెప్పారు. ఇందుకోసం రూ. 30 చెల్లించాలని మెట్రో సిబ్బంది ఆ యువకుడిని నిలిపివేశారు. ఇదే విషయమై మెట్రో సిబ్బంది, ఆ యువకుడికి మధ్య చాలా సేపటి వరకు వాగ్వాదం నడించింది. కానీ, సిబ్బంది వినలేదు.. ఇక ఎంత వాదులాడినా ప్రయోజనం లేదనుకుని చేసేది లేక ఛార్జీ చెల్లించి మెట్రో ఎక్కాడు బాధిత యువకుడు.

ఇవి కూడా చదవండి

ఆ తరువాత వెంటనే తన అనుభవాన్ని X లో పోస్ట్ చేశాడు. సాధారణంగా మెట్రోలో ఈ తరహా బ్యాగ్ లతో ప్రయాణించడం పెద్ద విషయం కాదు. దానికి ఛార్జీ కూడా ఉండదు. కానీ, బెంగళూరు మెట్రోలో బ్యాగుతో ప్రయాణించిన ఈ యువకుడిని నమ్మ మెట్రో సిబ్బంది అడ్డుకోవడం పట్ల అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. లగేజీపై అదనపు ఛార్జ్ వసూలు చేయటం ప్రజలను మెట్రోకు దూరం చేసినట్టే అవుతుందని రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..