వామ్మో.! ఈ కిలేడికి ఏకంగా 8మంది భర్తలు.. తొమ్మిదో పెళ్లికి రెడీ అవుతుండగా..
పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు అద్బుతాలు సృష్టిస్తుండే.. మరికొందరు అదే టెక్నాలజీని వాడుకొని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలానే సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వినియోగించుకొని ఒక మహిళ ఏకంగా 8 మంది పెళ్లాడి వాళ్ల నుంచి డబ్బులు కాజేసింది. తొమ్మిదో పెళ్లి కోసం సిద్ధమవుతూ పోలీసులకు చిక్కింది.

పెళ్లికాని దనవంతులే ఆమె టార్గెట్, మ్యాట్రిమోనీ, షాడీడాట్‌కామ్ వంటి వెబ్‌సైట్ల నుంచి ధనికులైన పెళ్లికాని వ్యక్తుల వివరాలు సేకరించి వాళ్లకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రిక్వెస్ట్‌లు పెట్టి వారితో పరిచయం పెంచుకుంటుంది. అలా వాళ్లతో మెల్లగా మాటలు కలిపి తన మాయలోకి దించుతుంది. కొన్ని సమస్యల కారణంగా తన భర్తలో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, తన కు ఒక బిడ్డ ఉందని చెప్పి వాళ్లకు మానసికంగా దగ్గరవుతుంది. ఇలానే వాళ్లను ప్రేమలోకి దించి దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తుంది. ఇలానే దాదాపు 8 మందిని పెళ్లాడింది. తొమ్మిదో పెళ్లి కోసం సిద్ధమవుతూ పోలీసులకు చిక్కింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్‌కు చెందిన సమీరా ఫాతిమా అనే ఈ మహిళ మొదట్లో ఉపాధ్యాయిగా పనిచేస్తూ జీవనం సాగించేది. ఈజీ మనీ ఫాస్ట్ లైఫ్‌కు అలవాటు పడిన ఈమే సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు ఈ అక్రమ మార్గాలను ఎంచుకుంది. అనుకున్న ప్రకారం పెళ్లికాని ధనవంతులకు వలవేసి వాళ్లను పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కాపురం చేశాక.. పథకం ప్రకారం తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అందుకు పెళ్లి చేసుకున్న వ్యక్తులు నిరాకరిస్తే వాళ్లను బెదిరించేందుకు ఈమెకు ఒక గ్యాంగ్ కూడా ఉంది. ఇలా ఇప్పటి వరకు సుమారు 8 మందిని పెళ్లాడి వాళ్ల నుంచి డబ్బులు కాజేసింది.
అయితే ఇలా మోసపోయిన ఆమె మాజీ భర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదురు మహిళ తన నుంచి రూ.50లక్షలు బెదిరించి బలవంతంగా వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో ఆమె అసలు భాగోతం బయటపడింది. దీంతో ఈ గత జులై 29వ తేదీన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




