Bajrang Dal: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో రోడ్డు మధ్యలో బజరంగ్ దళ్ కార్యకర్తలు కత్తులతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ అయిన అనంతరం కర్ణాటక పోలీసులు స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ బెళగవి పోలీసు అధికారి తెలిపారు. అక్టోబర్ 13న బుధవారం ఆయుధ పూజ సందర్భంగా ఈ ఊరేగింపు జరిగినట్లు సమాచారం. ఊరేగింపులో భజరంగ్ దళ్ సభ్యులెవరూ కోవిడ్ -19 ప్రోటోకాల్ పాటించలేదు. మాస్కులు ధరించలేదు..భౌతిక దూరం పాటించలేదు. ఈ వీడియో వైరల్ అయిన తరువాత పలువురు నెటిజన్లు.. ట్విట్టర్‌లో కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కరోనా విజృంభిస్తోందని.. దీంతోపాటు నడిరోడ్డుపై కత్తులతో డ్యాన్సులు చేయడం ఎంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు.
కాగా.. ఈ వీడియో వైరల్ అయిన అనంతరం బెళగవి డిప్యూటీ కమిషనర్ ఎంజి హిరేమథ్ స్పందించారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని.. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామంటూ హిరేమథ్ తెలిపారు. ఆయుధ పూజ సందర్భంగా భజరంగ్ దళ్ సభ్యులు పీరన్‌వాడిలో ఊరేగింపు నిర్వహించారు. డీజే పాటకు అనుగుణంగా భజరంగ్ సభ్యులు కత్తులతో నృత్యం చేస్తున్నారు. అయితే.. ఈ కార్యక్రమం పోలీసు భద్రతా నడుమ జరిగిందని.. కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరూ పాటించలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా చూడండి..
ట్విట్టర్‌లో నెటిజన్ షేర్ చేసిన వీడియో..
Swords drawn, Bajrang Dal workers dance on Belagavi road. Part of Dasara celebrations, the outfit claims. The gathering is being probed by district police. @TheQuint pic.twitter.com/K0O9eIWZal
— Nikhila Henry (@NikhilaHenry) October 18, 2021
Also Read: