Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్ సీరియస్..!

|

Mar 31, 2024 | 7:59 AM

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ మహిళా అభ్యర్థులపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న కామెంట్స్‌ వివాదాలు రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ నేత ఒకరు చేసిన కామెంట్‌కు బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ కౌంటరిచ్చారు. దావణగెరె పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వర్‌పై 92 ఏళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలను బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా తీవ్రంగా ఖండించారు.

Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్ సీరియస్..!
Saina Nehwal On Shamanur Shivashankarappa
Follow us on

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ మహిళా అభ్యర్థులపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న కామెంట్స్‌ వివాదాలు రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ నేత ఒకరు చేసిన కామెంట్‌కు బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ కౌంటరిచ్చారు. దావణగెరె పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వర్‌పై 92 ఏళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలను బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా తీవ్రంగా ఖండించారు.

కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేవనగరి బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వరను ఉద్దేశిస్తూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. గాయత్రి వంట గదికి మాత్రమే సరిపోతారంటూ కించపరిచేవిధంగా మాట్లాడారు. దీనిపై బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. అమ్మాయిలు పోరాడగలరని చెప్పే కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇలాంటివి ఊహించలేదంటూ సైనా నెహ్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భారత్‌కు పతకాలు సాధించినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఏం ఆలోచించిందని సైనా ప్రశ్నించారు. మహిళల పట్ల ఇలాంటి దృక్పథం ఉన్నవారు దాని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఓవైపు నారీశక్తికి వందనం అని చెబుతూనే.. మహిళలు పలు రంగాల్లో పెద్ద పెద్ద కలలు కంటున్నప్పుడు ఇలా ఎందుకు కించపరుస్తున్నారని సైనా ప్రశ్నించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిందని, ఈ తరుణంలో మహిళలకు అవమానం జరగడం బాధాకరమని సైనా రాసుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శివశంకరప్పపై బీజేపీ కన్నెర్ర చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శివశంకరప్ప వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…