Central Govt: వైద్యుల ఆందోళనలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. అసలు విషయం ఏంటంటే..

Central Govt: ఆయుర్వేద వైద్యులు కూడా శస్త్రచికిత్సలు చేయొచ్చంటూ కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

Central Govt: వైద్యుల ఆందోళనలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. అసలు విషయం ఏంటంటే..

Updated on: Feb 03, 2021 | 3:54 AM

Central Govt: ఆయుర్వేద వైద్యులు కూడా శస్త్రచికిత్సలు చేయొచ్చంటూ కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై శాస్త్రీయ వైద్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయితే వైద్యుల ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆయుర్వేద పీజీలో శల్య, శాలక్య విభాగాల విద్యార్థులకు 58 రకాల శస్త్ర చికిత్సల్లో శిక్షణ ఇస్తారని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఆ మేరకు రాజ్యసభలో స్పష్టమైన ప్రకటన చేశారు. ఆయుర్వేద పీజీలో శల్య, శాలక్య విద్యార్థులకు శస్త్ర చికిత్సలు చేయడానికి అనుమతి ఉందా? పేషెంట్ల భద్రతకు, ఆరోగ్యానికి ప్రభుత్వ హామీ ఉందా? అని రాజ్యసభలో ప్రజాప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. ఆయుర్వేద వైద్యులు నిర్ణీత చికిత్స తప్ప మరే ఇతర శస్త్ర చికిత్సలు చేయడానికి అనుమతులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇండియన్ మెడికల్ సెంట్రల్ కౌన్సిల్, అమెండ్‌మెంట్ రెగ్యూటేషన్స్ 2020 లో నిర్ణయించిన సర్జరీలు స్వతంత్రంగా చేసేలా ఆయుర్వేద వైద్యులకు శిక్షణ ఇప్పిస్తామని కేంద్ర మంత్రి సభలో ప్రకటించారు.

Also read:

Central Govt: వైద్యుల ఆందోళనలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. అసలు విషయం ఏంటంటే..

ICC Awards Nomination: మరోసారి మారుమోగుతున్న టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ పేరు.. ఎందుకంటే..