A deer friend: నాలుగేళ్ల బాలుడితో జింక పిల్ల స్నేహం.. నెట్టింట వైరల్‌గా మారిన పోటోలు..

A deer friend: స్నేహం అద్భుతమైనది అంటారు. నిజమైన మిత్రులకు మించిన ఆస్తులు లేవంటారు. స్నేహానికి ఎల్లలు లేవని, సరిహద్దులను

A deer friend: నాలుగేళ్ల బాలుడితో జింక పిల్ల స్నేహం.. నెట్టింట వైరల్‌గా మారిన పోటోలు..
Follow us

|

Updated on: Feb 03, 2021 | 3:40 AM

A deer friend: స్నేహం అద్భుతమైనది అంటారు. నిజమైన మిత్రులకు మించిన ఆస్తులు లేవంటారు. స్నేహానికి ఎల్లలు లేవని, సరిహద్దులను సైతం చెరిపేసే శక్తి స్నేహానికి ఉంటుందంటారు. అలాగే ఆ స్నేహానికి జాతి బేదం కూడా ఉండదు. ఉదాహరణకు ఎంతో మంది ప్రజలు మనుషులతోనే కాదు.. జంతువులతోనూ స్నేహం చేస్తారు. ఒక్కోసారి మనుషులు చూపే ప్రేమకన్నా.. జంతువులు చూపే ప్రేమనే అమితంగా ఆస్వాదిస్తారు. ఇక శునకానికి, మనిషికి మధ్య సావాసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లలకు కుక్కలతో, పిల్లులతో ఆడుకోవడం అంటే మహా సరదా. నేపథ్యంలోనే తాజాగా అమెరికాలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం మస్సానుట్టెన్ ప్రాంతంలోని కుటుంబం ఉంది. వారికి డొమినిక్ అనే నాలుగేళ్ల పిల్లాడు ఉన్నాడు. రోజూలాగే బాలుడు ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ జింక పిల్ల వచ్చింది. అతనితో సరదాగా ఆడుకుంది. కాసేపు ఆడుకున్న తరువాత బాలుడు ఆ జింక పిల్లను వెంట బెట్టుకుని తన ఇంటికి వెళ్లాడు. బాలుడి తల్లి డోర్ తీసి చూడగా.. బాలుడి పక్కన జింక పిల్ల కనిపించడంతో షాక్‌కు గురయ్యింది. ఆ వెంటనే బాలుడిని, జింక పిల్లను దగ్గరకు తీసుకుంది. అయితే, జింక పిల్ల తప్పిపోయి ఉంటుందని భావించిన ఆ బాలుడి తల్లి కాసేపు బయటనే ఆడుకోమని పిల్లాడికి చెప్పింది. జింక పిల్ల తల్లి వచ్చేస్తుందని, అప్పుడు అది సేఫ్‌గా తన తల్లితో వెళ్లిపోతుందని బాలుడికి వివరించింది. అలా ఆ జింక పిల్ల ఉన్నంత సేపు బాలుడితో సరదాగా ఆడుకుంది. కాగా, జింకతో బాలుడు ఉన్నప్పుడు అతని తల్లి ఫోటోను దింపింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది.

Also read:

Blood Pressure: ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.. రక్తపోటును అదుపులో ఉంచుకోండి.. ఆరోగ్యాన్ని పదిలం చేసుకోండి..

ICC Awards Nomination: మరోసారి మారుమోగుతున్న టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ పేరు.. ఎందకంటే..

Latest Articles
తల్లి అనంతలోకాలకు చేరినా.. తెగని పంచాయితీ..
తల్లి అనంతలోకాలకు చేరినా.. తెగని పంచాయితీ..
మరో వివాదంలో చిక్కుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!
మరో వివాదంలో చిక్కుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!
ఉల్లి రసం గురించి ఈ ఫ్యాక్ట్స్ తెలిస్తే.. అస్సలు వదిలి పెట్టరు!
ఉల్లి రసం గురించి ఈ ఫ్యాక్ట్స్ తెలిస్తే.. అస్సలు వదిలి పెట్టరు!
పెట్రోల్ పోసి తగులబెట్టారు.. పోలీసుల దర్యాప్తులో సంచలనం!
పెట్రోల్ పోసి తగులబెట్టారు.. పోలీసుల దర్యాప్తులో సంచలనం!
బెంగళూరు గెలిస్తే వాళ్లకు డేంజర్ బెల్స్ మోగినట్లే..
బెంగళూరు గెలిస్తే వాళ్లకు డేంజర్ బెల్స్ మోగినట్లే..
మళ్లీ సెట్స్‌పైకి వచ్చేసిన నటసింహం.. బాలయ్య 109 మూవీ విశేషాలు ఇవే
మళ్లీ సెట్స్‌పైకి వచ్చేసిన నటసింహం.. బాలయ్య 109 మూవీ విశేషాలు ఇవే
ఈ అలవాట్లు ఉంటే.. 50యేళ్లకు వచ్చే హైబీపీ 20యేళ్లకే తిష్టవేస్తుంది
ఈ అలవాట్లు ఉంటే.. 50యేళ్లకు వచ్చే హైబీపీ 20యేళ్లకే తిష్టవేస్తుంది
అరటి పండు తొక్క తీసినట్టు ఈజీగా వెల్లుల్లి పొట్టు తీయొచ్చు..
అరటి పండు తొక్క తీసినట్టు ఈజీగా వెల్లుల్లి పొట్టు తీయొచ్చు..
'విశ్వంభర'.. చిరంజీవికి ఎంతో స్పెషల్.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్
'విశ్వంభర'.. చిరంజీవికి ఎంతో స్పెషల్.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్
వేసవిలో కళ్ల సమస్యలా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నయనానందమే!
వేసవిలో కళ్ల సమస్యలా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నయనానందమే!