న్యూయార్క్ లో అయోధ్యా రాముని ‘చిత్ర ప్రదర్శనలు’

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగిన సందర్భంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతం కళకళలాడింది.  ఇక్కడి అతి పెద్ద డిజిటల్ బోర్డుపై ఆలయ నమూనాతో బాటు రాముని నిలువెత్తు 3 డీ పోర్ట్రైట్ ను ప్రదర్శించారు.

న్యూయార్క్ లో అయోధ్యా రాముని చిత్ర ప్రదర్శనలు

Edited By:

Updated on: Aug 06, 2020 | 11:07 AM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగిన సందర్భంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతం కళకళలాడింది.  ఇక్కడి అతి పెద్ద డిజిటల్ బోర్డుపై ఆలయ నమూనాతో బాటు రాముని నిలువెత్తు 3 డీ పోర్ట్రైట్ ను ప్రదర్శించారు. 17 వేల చదరపు అడుగుల ఎత్తయిన ఈ బిల్ బోర్డుపై ఏ ఈవెంట్ నైనా ప్రదర్శించాలనుకుంటే భారీ చార్జీలను చెలించాల్సి ఉంటుంది. అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీశ్ సెహ్వానీ ఆధ్వర్యాన ఈ నగరంలో అయోధ్య కార్యక్రమాలను భారీ స్క్రీన్లపై ప్రదర్శించారు. నగరమంతా శోభాయమానంగా అలంకరించారు.అయోధ్యలో  ప్రధాని మోడీ కనువిందుగా భూమిపూజను నిర్వహించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ నగరంలో పలుచోట్ల మోదీ పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. టైమ్స్ స్క్వేర్ వద్ద చేరి న వేలాది భారతీయులు ఆసక్తిగా ఈ బిల్ బోర్డుపై ప్రదర్శించిన ‘విశేషాలను’ తిలకించారు.