అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ ఇకలేరు..

ఫిబ్రవరి 4న, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆచార్య సత్యేంద్ర దాస్ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి SGPGIకి చేరుకున్నారు. శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఫిబ్రవరి 2న పక్షవాతం (స్ట్రోక్) కారణంగా మొదట అయోధ్యలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుండి వైద్యులు ఆయనను SGPGIకి సూచించారు.

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ ఇకలేరు..
Ayodhya Ram Temple Chief

Updated on: Feb 12, 2025 | 10:51 AM

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం అతని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటంతో అతన్ని లక్నోలోని SGPGIలో చేర్చారు. SGPGI ఆసుపత్రి పరిపాలన ప్రకారం, ఆచార్య సత్యేంద్ర దాస్ మధుమేహం, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆయనకు స్ట్రోక్ అటాక్ అయినట్టుగా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత అతని పరిస్థితి విషమంగా మారిందని చెప్పారు. ఉదయం 8 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని ప్రకటించారు.

ఫిబ్రవరి 4న, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆచార్య సత్యేంద్ర దాస్ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి SGPGIకి చేరుకున్నారు. శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఫిబ్రవరి 2న పక్షవాతం (స్ట్రోక్) కారణంగా మొదట అయోధ్యలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుండి వైద్యులు ఆయనను SGPGIకి సూచించారు.

ఆచార్య సత్యేంద్ర దాస్ రామ జన్మభూమి ప్రధాన పూజారి. ఆయన బాల్యం నుంచి అయోధ్యలోనే నివసించారు. దాస్ కు రాంలాలా ఆలయంతో దాదాపు 33 సంవత్సరాలు అనుబంధం ఉంది. 1992లో బాబ్రీ కూల్చివేతకు ముందు నుండే ఆయన ఈ ఆలయంలో పూజలు చేస్తున్నాడు. ఆయన రామాలయ ప్రధాన పూజారి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..