SBI Pension Loans: పెన్షన్‌దారులకు ఎస్‌బీఐ శుభవార్త.. ఒక్క ఎస్ఎంఎస్‌తో రూ.14 లక్షల వరకు పెన్షన్ లోన్

|

Feb 23, 2021 | 9:35 PM

SBI Pension Loans: దేశీయ ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు రోజురోజుకు సరికొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది..

SBI Pension Loans: పెన్షన్‌దారులకు ఎస్‌బీఐ శుభవార్త.. ఒక్క ఎస్ఎంఎస్‌తో రూ.14 లక్షల వరకు పెన్షన్ లోన్
Follow us on

SBI Pension Loans: దేశీయ ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు రోజురోజుకు సరికొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా పెన్షనర్ల కోసం సరికొత్త లోన్‌ ఆప్షన్‌ను తీసుకువచ్చింది. ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్టు చేసింది. కేవలం ఒక్క ఎస్‌ఎంఎస్‌ చేస్తే చాలు ఎస్‌బీఐ రుణం అందిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్‌ తీసుకునేవారు, డిఫెన్స్‌ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు రుణం తీసుకునేందుకు అర్హులు అని ఎస్‌బీఐ ప్రకటించింది. అలాగే 9.75 శాతం వడ్డీతో సంతోషంగా రిటైర్మెంట్‌ తీసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ లోన్‌ 14 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుందని ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు.

ఎస్‌ఎంఎస్ (SMS)‌ అలాగంటే..

PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు మెస్సేజ్‌ చేయాలని తన ట్వీట్‌లో ఎస్బీఐ తెలిపింది. అలాగే 7208933142కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే మీకు ఎస్‌బీఐ కాంటాక్ట్‌ సెంటర్‌ నుంచి కాల్ బ్యాక్‌ చేస్తారు. మీ పిల్లల పెళ్లిళ్లు చేయడానికి, మీ డ్రీమ్‌ హోమ్‌ కొనుగోలు చేసేందుకు, మెడికల్‌ అవసరాల కోసం రిటైర్మెంట్‌ ఫండ్‌ తరహాలో ఎస్‌బీఐ పెన్షనర్లకు పెన్షన్‌ లోన్‌ అందిస్తుంది. పూర్తి వివరాలకు ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 1800-11-2211కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.