ఢిల్లీ ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ లభించక మహిళా రోగి మృతి, డాక్టర్లు, నర్సులపై బంధువుల దాడి

ఢిల్లీ లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ లభించకపోవడంతో ఓ మహిళా కోవిడ్ రోగి మరణించింది.  దీంతో ఆమె బంధువులు మూకుమ్మడిగా వచ్చి  ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, నర్సులు,,,

ఢిల్లీ ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ లభించక మహిళా రోగి మృతి, డాక్టర్లు, నర్సులపై బంధువుల దాడి
Attack On Hospital Staff In Delhi

Edited By: Anil kumar poka

Updated on: Apr 27, 2021 | 8:59 PM

ఢిల్లీ లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ లభించకపోవడంతో ఓ మహిళా కోవిడ్ రోగి మరణించింది.  దీంతో ఆమె బంధువులు మూకుమ్మడిగా వచ్చి  ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడికి దిగారు, వీరు ఉదయం 9 గంటల ప్రాంతంలో హాస్పిటల్ లోకి కర్రలతో వచ్చి  ఎటాక్ చేశారు. ఈ ఘటనతో వైద్య సిబ్బంది చెల్లాచెదరయ్యారు. రోగి కుటుంబ సభ్యుల్లో కిందరు హాస్పిటల్ భవన అద్దాలను పగులగొట్టారు, పూల కుండీలను ధ్వంసం చేశారు. అయితే ఇంత జరిగినా హాస్పిటల్  గానీ, మరణించిన రోగి కుటుంబ సభ్యుల నుంచి గానీ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కానీ ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేస్తూ  విషమ స్థితిలో  ఉన్న ఈ రోగిని బంధువులు ఆసుపత్రికి తీసుకువచ్చారని,  వెంటనే  చికిత్స అందిందని, కానీ బెడ్స్ కొరత వల్ల  ఆమెను మరో ఫెసిలిటీకి మార్చాలని కోరామని వెల్లడించింది. ఆ లోగానే ఆమె మృతి చెందిందని  పేర్కొంది. దీంతో ఆమె బంధువులు తమ వైద్య సిబ్బందిపై దాడికి దిగారని, హాస్పిటల్ ఆస్తులకు నష్టం కలిగించారని  వెల్లడించింది.

ఈ కోవిద్ పాండమిక్ లో రోగులకు సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులపై  చేస్తారా అని యాజమాన్యం ప్రశ్నించింది. ఆసుపత్రి  సెక్యూరిటీ,పోలీసులు  పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు తెలిపింది. హాస్పిటల్ సిబ్బందికి పోలీసు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు  ఇటీవలే ఆదేశించింది. కానీ దాడులు జరుగుతూనే  ఉన్నాయి.