జమ్ము-కశ్మీర్‌తో పాటు హర్యానా రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. పలు దశల్లో సమీక్షల అనంతరం కశ్మీర్‌లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నామని.. ఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్18న తొలిదశ, 25న రెండో దశ, అక్టోబర్1న మూడో దశ ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు అక్టోబర్4న వెలువడతాయి. మొత్తం 90 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అటు హర్యానలోని 90 నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 1న సింగిల్‌ఫేజ్‌లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు 4న వెలువడతాయి. అక్టోబర్6 వరకూ రాష్ట్రంలో కొడ్ కొనసాగుతుంది.
జమ్మూ కశ్మీర్ గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌తో జమ్ములో ఐదు ఫస్ట్ టైమ్ ఈవెంట్స్‌గా చూడొచ్చు.
— 2014లో జమ్ముకశ్మీర్ ఒక పరిపూర్ణమైన రాష్ట్రం.
— అప్పుడు ఆ రాష్ట్రంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఐదు దశల్లో 87సీట్లకు ఎన్నిక జరిగింది
— 2019లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలితంగా అవతరించింది. ఆ తర్వాత జరుగుతున్న ఫస్ట్ ఎలక్షన్ ఇది
— దాదాపు 70ఏళ్ల పాటు స్పెషల్ స్టేటస్ అనుభవించిన జమ్మూకశ్మీర్.. ఆర్టికల్ 370రద్దుతో మూడు ముక్కలైంది. ఆ తర్వాత జరుగుతున్న ఫస్ట్ ఎన్నికలు ఇవి
జమ్మూ-కశ్మీర్ విభజనకు ముందు లడఖ్ కూడా వీటిల్లో ఒక భాగంగా ఉండేది. ఎప్పుడైతే పునర్విభజన జరిగిందో.. ఆ తర్వాత లడఖ్ కేంద్రపాలితమైంది. దాని అసెంబ్లీ లేదు. సో ఇప్పుడు ఆ పార్ట్ లేకుండా మిగతా జమ్మూ-కశ్మీర్‌కి ఎన్నికలు జరుగుతున్నాయి.
2022లో డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత మొన్న లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ స్థానాలకూ జరిగిన డీలిమిటేషన్‌తో 87సీట్లు కాస్తా.. 90 అయ్యాయి. ఆ ప్రక్రియ తర్వాత ఇప్పుడు జరుగబోతున్న ఎన్నికలు ఫస్ట్ టైమ్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి