అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు

| Edited By:

Aug 15, 2020 | 11:29 AM

అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే లక్షల మంది వరదల బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 30 జిల్లాల్లో వరదలు బీభత్సాన్ని..

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు
Follow us on

అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే లక్షల మంది వరదల బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 30 జిల్లాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మొత్తం 56.89 లక్షల మంది వరదల బారినపడ్డట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ వరదల బారినపడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 112 మంది మృతి చెందారు. ధీమాజీ, బక్సా, మోరీగామ్ జిల్లాల్లో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే.. వరదలకు రాష్ట్ట్రంలో వేలాది హెక్టార్ల పంటపొలాలు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున పాడి పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. వన్యమృగాలు కూడా వరదల దాటికి మరణించాయి.

కాగా, ఓ వైపు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తుండగా.. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 74 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

 

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా