ఆరేళ్లుగా మైనర్ బాలికతో వెట్టిచాకిరీ.. అధికారులు వచ్చేసరికి బెడ్ బాక్స్‌లో దాచిన కుటుంబం..!
అస్సాం రాజధాని గౌహతిలోని పంజాబరి ప్రాంతంలో అమానుష ఘటన ఒకటి చోటు చేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలిక బెడ్ బాక్స్‌లో దాచిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పంజాబరిలోని జురిపార్‌లోని ఇంటి నంబర్ 69 వద్ద ఈ సంఘటన జరిగింది.

అస్సాం రాజధాని గౌహతిలోని పంజాబరి ప్రాంతంలో అమానుష ఘటన ఒకటి చోటు చేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలిక బెడ్ బాక్స్‌లో దాచిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పంజాబరిలోని జురిపార్‌లోని ఇంటి నంబర్ 69 వద్ద ఈ సంఘటన జరిగింది. జిల్లా కార్మిక శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందం తనీఖీలు చేపట్టింది. దీంతో అమ్రీన్ అక్తర్ లస్కర్ అనే మహిళ ఇంటిపై దాడి చేసింది. స్థానిక నివాసితుల ఫిర్యాదు మేరకు మేజిస్ట్రేట్ సమక్షంలో సోదాలు నిర్వహించారు. దీంతో మైనర్ బాలికకు విముక్తి కల్పించారు.
అరీనా లస్కర్ ఖాతున్ ఇంట్లో 13 ఏళ్ల బాలిక పనిమనిషిగా ఉన్నది. ఆ మైనర్ బాలికతో ఆరేళ్లుగా ఇంటి పనులు చేయిస్తున్నారు. ఆమెను చిత్రహింసలకు గురి చేసి శారీరకంగా హింసిస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో బాల కార్మిక వ్యతిరేక టాస్క్‌ఫోర్స్ అప్రమత్తమైంది. ఫిబ్రవరి 1న మేజిస్ట్రేట్ సమక్షంలో జిల్లా కార్మిక అధికారులు, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అయితే తమ ఇంట్లో బాలిక పని చేయడం లేదని, నాలుగు రోజుల కిందటే ఆమెను తండ్రి తీసుకెళ్లినట్లు ఇంటి యజమాని తెలిపారు.
మరోవైపు అధికారులు దీనిని నమ్మలేదు. ఆ ఇంట్లోని అన్ని గదులు, అన్ని చోట్ల వెతికారు. ఒక రూమ్‌లో వ్యక్తి నిద్రిస్తున్న బెడ్‌ను తనిఖీ చేశారు. ఆ బెడ్ బాక్స్‌ను తెరిచి చూడగా, లోపల దాచిన బాలిక బయటకు వచ్చింది. సుమారు 25 నిమిషాల పాటు ఆ బెడ్ బాక్స్‌లో ఆమెను దాచినట్లు తెలుసుకున్నారు. మైనర్ బాలికను రక్షించారు. అయితే, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసి, ఆ ఇంటి వారు మైనర్ బాలికను బెడ్ బాక్స్‌లో దాచినట్లు కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వీడియో ఇక్కడ చూడండి..
అయితే నిబంధనలకు విరుద్ధంగా బాల కార్మికులతో ఇంటి పనులు చేయిస్తున్న ఆ ఇంటి యజమానిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బెడ్ బాక్స్‌లో దాచిన మైనర్ బాలికను రెస్క్యూ చేసిన అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
