Boris Johnson Visits Sabarmati Ashram: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌కు వచ్చారు. లండన్ నుంచి ఆయన నేరుగా గుజరాత్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మా గాంధీ (Mahatma Gandhi) వాడిన చరఖాపై నూలు వడికారు. జాతిపితకు ఇది గౌరవ చిహ్నం అంటూ జాన్సన్ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవని, దేశం గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటుందని విజిటర్స్ బుక్ రాశారు జాన్సన్. గాంధీ అందించిన సత్యం, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఓ దిక్సూచిలాంటిదన్నారు. ఈ సందర్భంగా గాంధీ రాసిన గైడ్ టు లండన్ పుస్తకాన్ని సబర్మతి ఆశ్రమ నిర్వాహకులు బోరిస్ జాన్సన్‌కు గిఫ్ట్‌గా అందజేశారు. బోరిస్ జాన్సన్ వెంట గుజరాత్ సీఎం భూపేష్ పటేల్ ఉన్నారు.
కాగా.. సబర్మతీ ఆశ్రమ సందర్శకుల పుస్తకంలో బోరిస్ జాన్సన్ తన సందేశాన్ని కూడా పంచుకున్నారు. భారతీయ సంప్రదాయం, మహాత్మా గాంధీ సేవలను ప్రశంసిస్తూ యూకే పీఎం పుస్తకంలో రాశారు. అసాధారణ వ్యక్తి ప్రపంచానికి.. సత్యం, అహింస లాంటివి బోధించారని.. ఆయన ఆశ్రమానికి రావడం అదృష్టం అంటూ జాన్సన్ పేర్కొన్నారు.
#WATCH | Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram, tries his hands on ‘charkha’ pic.twitter.com/6RTCpyce3k
— ANI (@ANI) April 21, 2022
ఈ సందర్భంగా మహత్మా గాంధీ రాసిన ‘గైడ్ టు లండన్’ అనే పుస్తకాన్ని జాన్సన్ కు సబర్మతీ ఆశ్రమం బహుమతిగా ఇవ్వనుంది. ఇది ఇప్పటివరకు ప్రచురణ కాలేదు. ఇది కాకుండా.. మహాత్మా గాంధీ శిష్యురాలు మీరాబెన్ ఆత్మకథ ‘ది స్పిరిట్స్ పిల్‌గ్రిమేజ్’ కూడా బోరిస్ జాన్సన్‌కు సబర్మతీ ఆశ్రమం ఇవ్వనుంది.
‘The Spirit’s Pilgrimage’, the autobiography of Madeleine Slade or Mirabehn who became the Mahatma Gandhi’s disciple will be gifted to UK PM Boris Johnson by Sabarmati Ashram pic.twitter.com/B9IAWyR712
— ANI (@ANI) April 21, 2022
Also Read: