చైనా ఆక్రమణపై రాజ్ నాథ్ స్పీచ్, అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి

| Edited By: Pardhasaradhi Peri

Sep 15, 2020 | 6:06 PM

లడాఖ్ లోని సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో చేసిన ప్రకటన చాలా 'బలహీనం'గా ఉందని ఎంఐఎం ఎంపీ  అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఇది అసమగ్రంగా ఉందన్నారు. ప్రశ్న అడిగేందుకు..

చైనా ఆక్రమణపై రాజ్ నాథ్ స్పీచ్, అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి
Follow us on

లడాఖ్ లోని సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో చేసిన ప్రకటన చాలా ‘బలహీనం’గా ఉందని ఎంఐఎం ఎంపీ  అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఇది అసమగ్రంగా ఉందన్నారు. ప్రశ్న అడిగేందుకు తనను అనుమతించి ఉంటే భారత భూభాగంలోని వెయ్యి చదరపు కిలో మీటర్ల భాగాన్ని చైనా ఎందుకు ఆక్రమించిందని అడిగేవాడినన్నారు. అసలు చైనాతో తలెత్తిన పరిస్థితిపై సమాచారం కోసం ఇండియా ‘మీడియా లీకులపై’ ఎందుకు ఆధారపడుతోందని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఏ అధికార ప్రతినిధులైనా రోజూ లడాఖ్ లోని పరిస్థితిపై ఎందుకు బ్రీఫింగులు ఇవ్వడంలేదని కూడా ఒవైసీ ప్రశ్నించారు. మీడియా రిపోర్టింగ్ ను బ్యాన్ చేస్తూనే చర్చకు పార్లమెంటరీ రూల్స్ అనుమతిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.