Arvind Kejriwal: డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అరెస్టు కావొచ్చు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

|

Jul 22, 2022 | 4:38 PM

Arvind Kejriwal: కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 'ఆప్ జాతీయ స్థాయికి ఎదగడం చూడలేకపోతున్నారని శుక్రవారం అన్నారు.

Arvind Kejriwal: డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అరెస్టు కావొచ్చు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
Arvind Kejriwal
Follow us on

Arvind Kejriwal: కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ జాతీయ స్థాయికి ఎదగడం చూడలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. అయితే ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ పాలసీ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో కొన్ని లోపాలున్నాయంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసొడియాపై లెప్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్స్‌ చేశారు. ఆయన సిఫార్స్‌ చేసిన కొద్దిసేపటికే కేజ్రీవాల్‌ కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తురని ఆయన ఆరోపణలు గుప్పించారు. 2021-22లో ఢిల్లీ సర్కార్‌ కొత్త ఎక్సైజ్‌ పాలసీని తీసుకువచ్చింది. ఇందులో నిబంధనలు ఉల్లంఘించారని, లిక్కర్‌ మాఫియాకు రూ.144 కోట్ల ప్రయోజనం చేకూరిందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. మనీష్ సిసోడియాపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారని, ఆయనను అరెస్ట్ చేయబోతున్నారని కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను ఇరికించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మనీష్ సిసోడియా నిజాయితీపరుడు’ అని అన్నారు. కావాలనే కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఇవి కూడా చదవండి

తాము బ్రిటిషర్లకు భయపడకుండా ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్‌ వారసులమని, బ్రిటిషర్లకు క్షమాణలు చెప్పిన సావర్కర్ వారసులం కాదని వ్యాఖ్యానించారు. జైలు అంటే ఆప్‌ నేతలకు భయం లేదని అన్నారు. మనీష్ సిసోడియా నాకు 22 ఏళ్లుగా తెలుసు, అతను చాలా నిజాయితీపరుడు. ఢిల్లీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మనీష్ సిసోడియా ఢిల్లీలోని పాఠశాలలను మెరుగుపరచడానికి రాత్రింబగళ్లు కష్టపడ్డారని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించేవారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తమపై తప్పుడు కేసులు బనాయించి బురద జల్లాలని చూస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంపై కేంద్రం ఎందుకు అడ్డంకులు వేస్తోందో చెప్పాలన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీ దేశమంతటా విస్తరిస్తున్నదని అన్నారు.

 

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందని, తమ పార్టీ దేశమంతటా విస్తరిస్తున్న క్రమంలో తమ పార్టీ ముందుకు సాగేందుకు కేంద్రానికి ఇష్టం లేదన్నారు. తమ ప్రభుత్వం ఢిల్లీలో చేస్తున్న అభివృద్ధి పనులను చూడలేకి అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి