Arunachal Pradesh Results: అరుణాచల్‌లో నేడు తేలనున్న 133 మంది అభ్యర్థుల భవితవ్యం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అరుణాచల్‌లో 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 82.71 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏప్రిల్ 19న 60 స్థానాలకు గాను 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. బీజేపీ ఇప్పటికే 10 సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకుంది.

Arunachal Pradesh Results: అరుణాచల్‌లో నేడు తేలనున్న 133 మంది అభ్యర్థుల భవితవ్యం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
Arunachal Pradesh Counting

Updated on: Jun 02, 2024 | 8:01 AM

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అరుణాచల్‌లో 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 82.71 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏప్రిల్ 19న 60 స్థానాలకు గాను 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. బీజేపీ ఇప్పటికే 10 సీట్లు గెలుచుకుంది.

తొలి దశలో ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 82.71 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 77.51 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 50 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 19న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 60 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో అధికార భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 10 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 41 సీట్లు గెలుచుకుంది. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

50 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపును 24 కేంద్రాల్లో 2 వేల మంది అధికారులు నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పవన్ కుమార్ సేన్ తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు తుది విడత శిక్షణ సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సెంటర్లను ఏర్పాటు చేస్తామని సేన్ తెలిపారు. గ్యాంగ్‌టక్ జిల్లాలో తొమ్మిది, నామ్చిలో ఏడు, పాక్యోంగ్‌లో ఐదు, సోరెంగ్, గ్యాల్‌షింగ్‌లో నాలుగు, మంగన్‌లో మూడు స్థానాలకు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసింది ఈసీ. కౌంటింగ్ ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుల పర్యవేక్షణలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇక రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు జూన్‌ 4న ఉదయం 8 గంటల నుంచి 25 కేంద్రాల్లో జరుగుతుంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సహా 14 మంది అభ్యర్థులు అరుణాచల్ ప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ రెండు లోక్‌సభ స్థానాలు, 41 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…