Viral News: ఏదో హడావుడిగా తింటే ఇలాగే ఉంటుంది మరీ… నోట్లో పన్ను గుండెలో ఇరుక్కుంది..!

|

Jan 14, 2023 | 9:59 PM

ఆ రోగి పరిస్థితి విషమంగా ఉందని, ఇక్కడ వైద్యులు ఎండోస్కోపీ, సిటి స్కాన్ చేయగా ఆశ్చర్యపోయారు ఆసుపత్రి వర్గాలు.

Viral News: ఏదో హడావుడిగా తింటే ఇలాగే ఉంటుంది మరీ... నోట్లో పన్ను గుండెలో ఇరుక్కుంది..!
Paras Hospital
Follow us on

బీహార్ రాజధాని పాట్నాలో ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. పాట్నాలోని పరాస్ ఆసుపత్రి వైద్యులు ఒక క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆహారం తింటుండగా ఓ వ్యక్తి దంతాన్ని మింగేశాడు. అది గొంతు లోపలికి వెళ్లి గుండెకు, ఊపిరితిత్తులకు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో కఠినమైన సర్జరీ చేసి బాధితుడిని కాపాడారు పరాస్ ఆస్పత్రి వైద్యులు. బెగుసరాయ్‌లో నివసిస్తున్న 45 ఏళ్ల సురేంద్ర కుమార్‌కు పై దవడలో కృత్రిమ పన్నును అమర్చారు. ప్రమాదవశాత్తూ అతడు ఆ దంతాల సెట్‌ను మింగేసినట్టుగా పరాస్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఆ తర్వాత రోగికి భరించలేని నొప్పి మొదలైంది. దాంతో.. బెగుసరాయ్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో చూపించారు. ఆ రోగి పరిస్థితి విషమంగా ఉందని, ఇక్కడ వైద్యులు ఎండోస్కోపీ, సిటి స్కాన్ చేయగా ఆశ్చర్యపోయారు ఆసుపత్రి వర్గాలు. దాదాపు 10 సెంటీమీటర్ల మేర ఫుడ్‌పైప్‌కు కట్టిన హుక్‌తో చిరిగిపోయి, ఫుడ్‌పైప్‌లోంచి బయటకు వచ్చిన తర్వాత ఛాతీలోకి ప్రవేశించింది.

ఈ కట్టుడు పళ్లు గుండె బయటకు వచ్చే ఊపిరితిత్తుల మధ్య ప్రధాన ద్వారంలో ఇరుక్కుపోయాయి. దీని కారణంగా రోగి ఛాతీ ఎడమ వైపు చీముతో నిండిపోయింది. ఇన్ఫెక్షన్ చాలా పెరిగింది. దంతాలకు మెటల్ హుక్ తగిలించి ఉండడంతో దాన్ని బయటకు తీయడం పెద్ద సవాలేనని, ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రి డైరెక్టర్ జనరల్ సర్జరీ డాక్టర్ ఏఏ హై ఏడుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

‘ముందుగా ఛాతిలో ఇన్ఫెక్షన్​ తలెత్తిన ప్రాంతాన్ని శుభ్రం చేసి, థొరకోస్కోపీ నిర్వహించి అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాం. అనంతరం సర్జరీ నిర్వహించి దంతాన్ని సురక్షితంగా బయటకు తీశాం. ఈ ఆపరేషన్​కు నాలుగు గంటల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సురేంద్ర ఆరోగ్యం మెరుగుపడిందని, క్రమంగా కోలుకుంటున్నారని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..