370 అధికరణం నిజంగా రద్దు కాలేదు.. హరీష్ సాల్వే

|

Aug 06, 2019 | 1:28 PM

  కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించినప్పటికీ.. వాస్తవంగా ఇది రద్దు కాలేదని రాజ్యాంగ నిపుణుడు, మాజీ సొలిసిటర్ జనరల్, సీనియర్ లాయర్ కూడా అయిన హరీష్ సాల్వే అభిప్రాయపడ్డారు. ఇది రద్దు అన్నది ఒక అపోహ అని ఆయన వ్యాఖ్యానించారు. . ‘ ఈ అధికరణంలోని సెక్షన్-3.. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తోంది. అదే సమయంలో… ఎప్పుడైనా స్పెషల్ స్టేటస్ ను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రపతికి […]

370 అధికరణం నిజంగా రద్దు కాలేదు.. హరీష్ సాల్వే
Follow us on

 

కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించినప్పటికీ.. వాస్తవంగా ఇది రద్దు కాలేదని రాజ్యాంగ నిపుణుడు, మాజీ సొలిసిటర్ జనరల్, సీనియర్ లాయర్ కూడా అయిన హరీష్ సాల్వే అభిప్రాయపడ్డారు. ఇది రద్దు అన్నది ఒక అపోహ అని ఆయన వ్యాఖ్యానించారు. . ‘ ఈ అధికరణంలోని సెక్షన్-3.. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తోంది. అదే సమయంలో… ఎప్పుడైనా స్పెషల్ స్టేటస్ ను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రపతికి అధికారాలను కూడా సంక్రమింపజేస్తోంది. ఈ ఆర్టికల్ లోని నిబంధనలను ఎలా చూసినా.. రాష్ట్రపతి పబ్లిక్ నోటిఫికేషన్ ఆర్డర్ ద్వారా దీన్ని నిలిపివేయవచ్చు. లేదా కొన్ని సవరణలను సూచించవచ్చు. సెక్షన్-3 ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

ఈ నిబంధనను వినియోగించుకునే ప్రభుత్వం సోమవారం రాష్ట్రపతి కోవింద్ సంతకంతో కూడిన ఓ ఆర్డర్ ను ఒక్కసారిగా అమలులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. చూడబోతే పార్లమెంటు ఆమోదానికి లోబడి రాష్ట్రపతి ఈ ఆర్డర్ జారీ చేసినట్టు కనబడుతోందని హరీష్ సాల్వే అన్నారు. దీన్ని రద్దు చేయాలని పార్లమెంటు కోరితే తప్ప.. ఇది కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఇక కాశ్మీర్ పునర్విభజన రెండు దశల్లో జరగాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైనా.. వివాదాస్పద అధికరణం రద్దుపై సుప్రీంకోర్టు స్పందించగలదని సాల్వే సూచనప్రాయంగా చెప్పారు. ఇప్పటికే కొన్ని పిటిషన్లు కోర్టులో పెండింగులో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర నిర్ణయంపై తాము కోర్టుల్లో సవాలు చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా హెచ్ఛరించిన విషయం విదితమే.