జమ్ముకశ్మీర్‌కు సబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 370రద్దుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించారు. విపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య ఆయన ఈ ప్రకటన చేశారు. దీనికి వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ ప్రతిపాదనపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ స్పందించారు.
భారత ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజుని ఆమె తీవ్రంగా విమర్శించారు. ‘‘1947లో జమ్ముకశ్మీర్ నేతలు తీసుకున్న రెండు దేశాల సిద్ధాంతాలకు ఇది తూట్లు పొడవటమే. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం అక్రమం, రాజ్యాంగ విరుద్ధం. ఇది జమ్ముకశ్మీర్‌ను ఇండియా బలవంతంగా తమ చేతుల్లోకి తీసుకోవడం లాంటిదే. దీని వలన విపత్కర పరిణామాలు చోటుచేసుకోవచ్చు. భారత ప్రభుత్వ ఉద్దేశాలు పూర్తిగా అర్థమయ్యాయి. ప్రజలను భయపెట్టి వారు జమ్ముకశ్మీర్ భూభాగాన్ని కావాలనుకుంటున్నారు. కశ్మీర్ విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భారత ప్రభుత్వం విఫలమైంది’’ అని ముఫ్తీ పేర్కొన్నారు.
Today marks the darkest day in Indian democracy. Decision of J&K leadership to reject 2 nation theory in 1947 & align with India has backfired. Unilateral decision of GOI to scrap Article 370 is illegal & unconstitutional which will make India an occupational force in J&K.
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2019