ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్ …పంజాబ్‌లో హై అలర్ట్..

| Edited By:

Aug 07, 2019 | 9:04 PM

పంజాబ్‌లో హైలెర్ట్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలోకి టెర్రరిస్టులు చొరబడే అవకాశాలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున భద్రతా దళాలు సెర్జింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. హైవేల వద్ద పోలీస్ అధికారాలు తనిఖీలు చేస్తున్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో భద్రతాదళాలు మోహరించన పరిస్థితి లేదు. అయితే తాజా పరిణామాల నేపధ్యంలో ఉగ్రవాదులు చొరబడే అవకాశాలున్నందున గస్తీని ముమ్మరం చేశారు. […]

ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్ ...పంజాబ్‌లో హై అలర్ట్..
Follow us on

పంజాబ్‌లో హైలెర్ట్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలోకి టెర్రరిస్టులు చొరబడే అవకాశాలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున భద్రతా దళాలు సెర్జింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. హైవేల వద్ద పోలీస్ అధికారాలు తనిఖీలు చేస్తున్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో భద్రతాదళాలు మోహరించన పరిస్థితి లేదు. అయితే తాజా పరిణామాల నేపధ్యంలో ఉగ్రవాదులు చొరబడే అవకాశాలున్నందున గస్తీని ముమ్మరం చేశారు.

పాక్ సరిహద్దు రాష్ట్రం కావడంతోపాటు జమ్ము కశ్మీర్‌కు కూడా ఆనుకుని ఉండటంతో నిఘాను పటిష్టం చేశారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే పరిస్థితి ఉన్నందున రక్షణ దళాలు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా అనుకోని సంఘటన జరిగితే తీసుకోవాల్సిన రక్షణ చర్యలు సైతం తీసుకుంటున్నారు.

పంజాబ్‌లో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర డీజీపీ దినకర్ గుప్తా పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 15 వరకు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్టుగా పంజాబ్ పోలీస్ అధికారులు వెల్లడించారు.