కంగనా-శివసేన మధ్య ‘కయ్యం’, ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలన్న మహిళా కమిషన్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్, శివసేన నేత సంజయ్ రౌత్ మధ్య రేగిన కయ్యం మరో మలుపు తిరిగింది, కంగనాను ముంబైలోకి అడుగుపెట్టకుండా ఆమెను రాళ్లతోను, రాడ్లతోను కొట్టి చంపుతామని సేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్ నాయక్ ఓ ఇంటర్వ్యూలో...

కంగనా-శివసేన మధ్య కయ్యం, ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలన్న మహిళా కమిషన్

Edited By:

Updated on: Sep 05, 2020 | 11:07 AM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్, శివసేన నేత సంజయ్ రౌత్ మధ్య రేగిన కయ్యం మరో మలుపు తిరిగింది, కంగనాను ముంబైలోకి అడుగుపెట్టకుండా ఆమెను రాళ్లతోను, రాడ్లతోను కొట్టి చంపుతామని సేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్ నాయక్ ఓ ఇంటర్వ్యూలో హెచ్ఛరించడాన్ని జాతీయ  మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మఖండించారు. ఆయనను ముంబై పోలీసులు వెంటనే అరెస్టు చేయాలంటూ ట్వీట్ చేశారు. ఇతని వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకోవాలన్నారు. మహారాష్ట్రలోని పాల్గర్ లో సాధువులను స్థానికులు కొట్టి చంపినట్టీ కంగనాను కూడా కొట్టి చంపుతామని ప్రతాప్ సర్ నాయక్ ఇఛ్చిన వార్నింగ్ పట్ల రేఖాశర్మ మండిపడ్డారు. తను ఈ నెల 9 న ముంబై విమానాశ్రయంలో అడుగుపెడతానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని కంగనా సవాల్ చేసింది. అయితే తమ నేత సంజయ్ రౌత్ అండ చూసుకుని సేన ఎమ్మెల్యే ప్రతాప్.. ఆమె ఇక్కడికి రాగానే తమ పార్టీ మహిళా సభ్యులు ఆమె లెంపలు వాయగొడతారని వ్యాఖ్యానించారు.

సుశాంత్ కేసు ఇలా మధ్యలో కంగనా రనౌత్, శివసేన మధ్య రచ్ఛకు దారి తీసింది.