యూరీ సెక్టార్‌లో రెండు బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ

| Edited By:

Jun 23, 2020 | 4:14 PM

గత కొద్ది రోజులుగా పాక్‌ రేంజర్లు సరిహద్దుల్లో నిత్యం బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు మందుగుండ్లు పేలకుండా.. అలానే ఉండిపోతున్నాయి. పాక్‌....

యూరీ సెక్టార్‌లో రెండు బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ
Follow us on

గత కొద్ది రోజులుగా పాక్‌ రేంజర్లు సరిహద్దుల్లో నిత్యం బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు మందుగుండ్లు పేలకుండా.. అలానే ఉండిపోతున్నాయి. పాక్‌ పేల్చుతున్న షెల్స్‌ కూడా కొన్ని పేలకుండా అలానే పడిఉంటున్నాయి. అయితే వీటిని గమనించిన ఆర్మీ.. ఎప్పటి కప్పుడు నిర్వీర్యం చేస్తోంది. తాజాగా.. బారాముల్లా జిల్లాలో రెండు పేలని షెల్స్‌ను ఆర్మీ గుర్తించింది. దీంతో వెంటనే.. బాంబ్ డిస్మోసల్ స్క్వాడ్‌కు సమాచారం అందించింది.నంబాలా, యూరీ ప్రాంతంలో పేలకుండా పడిఉన్న రెండు షెల్స్‌ను.. బాంబ్ డిస్మోసల్
స్క్వాడ్‌ నిర్వీర్యం చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. నివాస ప్రాంతాల్లో పడి ఉండటంతో.. అవి పేలకపోవడం పెద్ద ప్రమాదమే తప్పింది. గత శనివారం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సరిహద్దుల్లోని ప్రజలు.. తమకు రక్షణగా బంకర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.