ఎప్పుడైనా రెడీ .. ఇదే ఆర్మీ ప్రయారిటీ.. న్యూ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్

|

Jan 01, 2020 | 2:00 PM

సర్వ వేళలా సంసిధ్ధంగా ఉండాలన్నదే సైన్యం ధ్యేయమని, ఇది తమ ప్రయారిటీ (ప్రాధాన్యత) అని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ ప్రకటించారు. మానవ హక్కులను గౌరవించడం పట్ల ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటామని ఆయన అన్నారు. ఢిల్లీలో బుధవారం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద సైనిక వందనం స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా దేశంలో ఉత్తరాదిన, ఈశాన్య ప్రాంతాల్లో సైన్యం సామర్థ్యతను మరింత పెంచుతామని ఆయన తెలిపారు. భారత సైన్యంలో 28 వ […]

ఎప్పుడైనా రెడీ .. ఇదే ఆర్మీ ప్రయారిటీ.. న్యూ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్
Follow us on

సర్వ వేళలా సంసిధ్ధంగా ఉండాలన్నదే సైన్యం ధ్యేయమని, ఇది తమ ప్రయారిటీ (ప్రాధాన్యత) అని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ ప్రకటించారు. మానవ హక్కులను గౌరవించడం పట్ల ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటామని ఆయన అన్నారు. ఢిల్లీలో బుధవారం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద సైనిక వందనం స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా దేశంలో ఉత్తరాదిన, ఈశాన్య ప్రాంతాల్లో సైన్యం సామర్థ్యతను మరింత పెంచుతామని ఆయన తెలిపారు.

భారత సైన్యంలో 28 వ ప్రధాన అధికారి అయిన మనోజ్ ముకుంద్.. ముందు కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. దీర్ఘ కాలం పెండింగులో ఉన్న సంస్కరణల అమలు, కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం అదుపు, టిబెట్ ప్రాంతంలో చైనా సైనిక జాడలపై నిఘా వంటివి ఇందులో ముఖ్యమైనవి. 37 ఏళ్ళ తన సర్వీసులో ఆయన.. అనేక కమాండ్, స్టాఫ్ అపాయింట్ మెంట్లకు సంబంధించిన అధికారి హోదాల్లో పని చేశారు. జమ్మూ కాశ్మీర్లో కౌంటర్ ఇన్-సర్జెన్సీ కార్యకలాపాలకు నేతృత్వం వహించారు. మంగళవారం ఈయన ఆర్మీ చీఫ్ గా కొత్త బాధ్యతలు స్వీకరించారు.